అంతర్జాతీయం

ముషారఫ్ మళ్లీ క్రియాశీలక పాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, అక్టోబర్ 6: పాకిస్తాన్ మాజీ సైన్యాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తన పార్టీని పునరుద్ధరించి, రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యం ఏ మేరకు సహకరిస్తుందనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 76 ఏళ్ళ జనరల్ (రిటైర్డ్) ముషారఫ్‌పై పాక్ ప్రభుత్వం 2016 సంవత్సరంలో పెట్టిన రాజద్రోహం కేసుతో కోర్టు దేశ బహిష్కరణ విధించింది. అప్పటి నుంచి ముషారఫ్ తన కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్‌లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ముషారఫ్ చాలా కాలంగా అస్వస్థతతో ఉన్నారు. గత నెలలో తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు లండన్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. 12 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న ముషారఫ్ తిరిగి లండన్‌కు చేరుకున్నారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇలాఉండగా ముషారఫ్ తమ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం పాక్‌లోని తమ పార్టీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిని పలు ఛానళ్ళు ప్రసారం చేశాయి. దీంతో ముషారఫ్ తన పార్టీని పునరుద్ధరించి, మళ్లీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించనున్నట్లు పాక్‌లోని పలు మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి.