అంతర్జాతీయం

ఐఏఎస్‌లు ఉత్సవ విగ్రహాలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 3: ఇండియన్ అడ్మినిస్ట్రేటీవ్ సర్వీస్‌లో తక్షణం సంస్కరణలు రావాలని అమెరికా స్పష్టం చేసింది. రాజకీయ నేతల జోక్యం ఎక్కువైపోయి ఆ వ్యవస్థ కుంటుపడుతోందని ఓ నివేదికలో వెల్లడించారు. ‘ఐఎఎస్‌లు ఉత్సవ విగ్రహాల్లా మారిపోతున్నారు. దీనికి కారణం రాజకీయ జోక్యమే. కాలం చెల్లిన విధానాలు కూడా వ్యవస్థ కుంటుపడేలా చేస్తున్నాయి’ అని పేర్కొంది. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ మీట్స్ బిగ్ డేటా పేరుతో విడుదలైన నివేదికలో అనేక అంశాలను నిష్కర్షగా ప్రస్తావించారు. 50 పేజీల నివేదికలో వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపారు. రాజకీయ జోక్యంతో అసమర్థలు అందలం ఎక్కుతున్నారని విమర్శించారు. ‘సమర్థత గల ఆధికారికి ప్రాధాన్యతగల పదవి దక్కడం లేదు. రాజకీయ నాయకులను తాబేదార్లుగా ఉన్న ఐఎఎస్‌లకు గుర్తింపు లభిస్తోంది. మంచి పోస్టులు కూడా వాళ్లకే దక్కుతున్నాయి’ అని వెల్లడించారు.