అంతర్జాతీయం

ఆంక్షలను సడలించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, అక్టోబర్ 9: తమ దేశానికి టెక్ కంపెనీలకు సాంకేతిక సహాయంపై అమెరికా విధించిన ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని చైనా డిమాండ్ చేసింది. దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో జోక్యం ఎంతమాత్రం తగదని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అమెరికాను హెచ్చరించింది. చైనా కంపెనీలకు సాంకేతిక సహకారాన్ని పూర్తిగా నిలిపివేయాలంటూ అమెరికా ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించింది. చైనా వాయవ్య రీజియన్‌లో ఉన్న జిన్‌జియాంగ్‌లో ఉన్న వేలాది ముస్లిం మైనారిటీల హక్కులను కాలరాసే విధంగా అమెరికా వ్యవహరించడం ఎంతమాత్రం తగదని స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా అమెరికా సాంకేతిక సహకారాన్ని నిలిపివేసేందుకు విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. దేశ పరిరక్షణ దృష్ట్యా అంతర్గత వ్యవహారాల్లో జోక్యంపై అవసరమైన నిర్ణయాలను త్వరలోనే తీర్మానించనున్నామని పేర్కొంది.
అయితే, తామేమీ ప్రతీకార చర్యలకు పాల్పడాలని భావించడం లేదనీ.. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను సడలించాలని మాత్రమే ఈ వారంలో జరగనున్న అమెరికా పర్యటనలో ఆ ప్రభుత్వానికి తెలియజేయనున్నట్లు స్పష్టం చేస్తామని వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అమెరికా తీసుకొన్న నిర్ణక్షాల వల్ల చైనాకు వాణిజ్య పరమైన అభివృద్ధి అంశంలో విఘాతం కలుగుతుందని పేర్కొంది.