అంతర్జాతీయం

బ్రెగ్జిట్ చర్చలకు గండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, అక్టోబర్ 9: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం (బ్రెగ్జిట్)పై చర్చల ప్రక్రియ అర్ధంతరంగా నిలిచిపోవడానికి రంగం సిద్ధమయింది. బహుశా మంగళవారంతో ఈ చర్చల ప్రక్రియ ఎలాంటి ఫలితం తేలకుండానే ముగిసిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇరు వర్గాలు దెబ్బకు దెబ్బ అనే రీతిలో వ్యవహరించడం వల్ల అక్టోబర్ వరకు ఉన్న గడువులోగానే చర్చలు అర్ధంతరంగా నిలిచిపోవడానికి దారితీసే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వచ్చే వారం బ్రస్సెల్స్‌లో కీలకమయిన యూరోపియన్ యూనియన్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. యూ రోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడానికి కొత్త నిబంధనల కోసం ప్రయత్నించిన బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఈ కీలకమయిన సదస్సు జరగనున్న తరుణంలో జర్మనీ చాన్స్‌లర్ ఏంజిలా మెర్కెల్‌తో మాట్లాడారు. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ డొనాల్డ్ టస్క్ వైఖరి కలహాలు పెట్టించేదిగా ఉందని ఏంజిలా మెర్కెల్ అభిప్రాయపడినట్టు భావిస్తున్నారు. బ్రిటన్ కథనం ప్రకారం.. దీర్ఘకాలికంగా ఉన్న ఐర్లాండ్ సరిహద్దు సమస్య విషయంలో బ్రిటన్ తన వైఖరి మార్చుకోవాలని మెర్కెల్ డిమాండ్ చేశారు. మెర్కెల్ వైఖరి వల్ల బ్రెగ్జిట్ చర్చలు మధ్యలోనే పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని బ్రిటన్ పేర్కొంది. బ్రిటన్ గత అయిదు దశాబ్దాలుగా యూరోపియన్ యూనియన్‌లో సభ్య దేశంగా ఉంటూ వస్తోంది. అయితే, యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలని 2016లో నిర్వహించిన రెఫరెండంలో బ్రిటన్ ప్రజలు తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు ప్రకారం యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగడానికి బ్రిటన్ ఇప్పటికే మూడు సంవత్సరాల సమయం తీసుకుంది. అయినప్పటికీ ఇంకా కొలిక్కి రాలేదు. అయితే బ్రెగ్జిట్‌కు ఒప్పందం కుదిరినా, కుదరకపోయినా అక్టోబర్ 31న బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగుతుందని బోరిస్ జాన్సన్ హెచ్చరిస్తూ వస్తున్నారు. అయితే, బ్రిటన్ ప్రధానమంత్రితో జరిగిన చర్చల వివరాలను వెల్లడించడానికి మెర్కెల్ కార్యాలయం నిరాకరించింది. అలాంటి రహస్యమయిన చర్చల వివరాలను వెల్లడించజాలమని పేర్కొంది.