అంతర్జాతీయం

మీరా సుద్దులు చెప్పేదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, అక్టోబర్ 11: కాశ్మీర్‌లో నివసిస్తున్న చిన్నారులకు సంబంధించి పాకిస్తాన్ తప్పుడు కథనాలను వ్యాపింపజేస్తోందని భారత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. స్కూలు పిల్లలకు తీవ్రవాద సిద్ధాంతాలు నూరిపోసి వారిని ఉగ్రవాద శిబిరాల్లో చేరుస్తున్న నీచమైన ఘనత పాకిస్తాన్‌దని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 3వ కమిటీ సమావేశంలో భారత్ వెల్లడించింది. పిల్లల అభివృద్ధి పరిరక్షణ అన్న అంశంపై జరిగిన చర్చలో భారత్ శాశ్వత మిషన్ తొలి కార్యదర్శి పౌలోమి త్రిపాఠి మాట్లాడారు. పాకిస్తాన్ పేరును ప్రత్యక్షంగా ప్రస్తావించకుండానే ఉగ్రవాదానికి సంబంధించి ఆ దేశ దుర్నితీని పౌలోమి ఎండగట్టారు. కాశ్మీర్‌కు సంబంధించి బూటకపు కథనాలను సృష్టించడం ద్వారా తప్పుడు రాజకీయ ప్రచారానికి పాకిస్తాన్ పాల్పడుతోందని భారత దేశ అంతరంగిక వ్యవహారాలను అనవసరంగా ప్రస్తావిస్తోందని పౌలోమి త్రిపాఠి అన్నారు. ఈ కమిటీ సమావేశంలో పాకిస్తాన్ దౌత్యవేత్త మలీహా లోథి చేసిన వ్యాఖ్యలను తూర్పారబట్టిన త్రిపాఠి ‘పాక్ అనవసరంగా కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. అక్కడి పరిస్థితికి సంబంధించి తప్పుడు కథనాలను ప్రచారంలోకి తెస్తోంది’ అని అన్నారు. చిన్నారులను ఉగ్రవాదులుగా మారుస్తున్న పాకిస్తాన్‌కు భారత దేశం గురించి, కాశ్మీర్‌లో పిల్లల స్థితి గతుల గురించి మాట్లాడే హక్కు లేదని త్రిపాఠి స్పష్టం చేశారు. ఈ చర్యల ద్వారా తమ దేశ చిన్నారుల భవితవ్యాన్ని పాక్ నాశనం చేస్తోందని ఆ విధంగా వారిని ఉగ్రవాదులుగా మార్చే కుయుక్తులకు పాల్పడుతోందని త్రిపాఠి అన్నారు. అమాయకపు పిల్లల హక్కులను హరించడంతో పాటు వారి భవితవ్యాన్ని, స్వేచ్చను కూడా పాకిస్తాన్ నాశనం చేస్తోందని పేర్కొన్న త్రిపాఠి ‘పొరుగు దేశం అనుసరిస్తున్న వైఖరిని ఏమి అనాలి?’ అంటూ గద్దించారు. తన తప్పుడు ప్రచారానికి మద్దతు సమకూర్చుకోవాలన్న ఉద్ధేశ్యంతోనే పాకిస్తాన్ అనవసరంగా ఐక్యరాజ్య సమితి నివేదికను ఉటంకించిందని త్రిపాఠి అన్నారు. పాకిస్తాన్ బృందం చేసిన ఈ తప్పుడు ఆరోపణలను ప్రపంచ దేశాలు విశ్వసించే పరిస్థితే లేదని గతంలో మాదిరిగానే పాక్ తాజా ప్రచారాన్ని కూడా సభ్య దేశాలన్నీ తిప్పికొట్టగలవన్న విశ్వాసం తమకు ఉందని స్పష్టం చేశారు. పిల్లల హక్కుల పరిరక్షణకు సంబంధించి ప్రపంచ దేశాల వైఖరిలో సానుకూల మార్పు వచ్చినప్పటికీ వీరంతా ఇప్పటికీ పేదరికం, అసమానతలు, సాయుధ ఘర్షణలు, ఉగ్రవాదంతో పాటు మానవీయ సంక్షోభాల మధ్య నలిగి పోతున్నారని త్రిపాఠి అన్నారు. పిల్లల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆధునిక రీతిలో వారి వికాసానికి అన్ని దేశాలు చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అలాగే వాతావరణ ప్రతికూల మార్పుల వల్ల కూడా పిల్లల భవితవ్యానికి చేటు కలిగే పరిస్థితి ఏర్పడుతున్నదని, దీనిపై కూడా సంయుక్త కార్యాచరణతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణకు భారత ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలను ఈ సందర్భంగా వివరించిన ఆమె ‘స్వచ్ఛ భారత్ పేరుతో దేశంలోని అన్ని పాఠశాలల్లోనూ తాగునీరు, పారిశుధ్యం ఆరోగ్యకర సౌకర్యాలను పెంపొదిస్తున్నాం, అలాగే స్కూళ్ళలో పిల్లల హాజరీని పెంచేందుకు మధ్యాహ్న భోజన పథకాన్ని పోషక విలువలతో కూడిన ఆహార కల్పన ద్వారా అమలు చేస్తున్నాం’ అని తెలిపారు. అలాగే బాలికల రక్షణ, సంరక్షణ, విద్యా వికాసాలకు కూడా భారత ప్రభుత్వం ఒక సమగ్ర కార్యక్రమాన్ని చేపట్టిందని, అలాగే లింగ వివక్షణను అరికట్టేందుకు స్రీ-పురుష నిష్పత్తిలోనూ తేడాలు అరికట్టేందుకు అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు.