అంతర్జాతీయం

టర్కీపై కఠిన వైఖరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: టర్కీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఆ దేశంపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని, ఆర్థిక వ్యవస్థను వేగంగా దెబ్బతీస్తామని హెచ్చరించారు. టర్కీ అధ్యక్షుడు రెసెప్ టరుూప్ ఎర్డోగాన్‌కు ఫోన్ చేసి, అంకారాతో 100 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని స్పష్టం చేశారు. సిరియాతో తక్షణమే సంధి కుదుర్చుకోకపోతే, టర్కీ మంత్రిత్వ శాఖలు, అధికారులపై కఠినాతికఠినమైన ఆంక్షలు అమలు చేస్తామన్నారు. ఆస్తులను స్తంభింప చేస్తామని, అమెరికాలోకి అడుగుపెట్టనీయబోమని తేల్చిచెప్పారు. సిరియా నుంచి వచ్చిన సుమారు 20 లక్షల మంది శరణార్థులను సరిహద్దులో ఓ శిబిరాన్ని ఏర్పాటు చేసి, అందులో ఉంచాలని టర్కీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ట్రంప్ మండిపడ్డారు. సిరియాలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నప్పటికీ, శరణార్థులను వారి స్వదేశానికి పంపకుండా అడ్డుకోవడం ఏమిటని టర్కీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యల వల్ల సిరియాలోని ప్రజాస్వామిక దళాలు (ఎస్‌డీఎఫ్) చేసిన కృషికి ఫలితం లేకుండాపోయిందని ట్రంప్ విమర్శించారు. సిరియా శరణార్థులను ప్రత్యేక శిబిరాల్లో ఉంచాలనే ఆలోచనను విరమించి, ఆ దేశంతో సంధి కుదుర్చుకోవాలని సూచించారు. లేకపోతే, ఆంక్షలు, చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. టర్కీ ఆర్థిక వ్యవస్థను అత్యంత వేగంగా, సమర్థంగా ధ్వంసం చేస్తామని అన్నారు.

*చిత్రం... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్