అంతర్జాతీయం

‘ఇది మా దేశం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంగ్జౌ (చైనా), సెప్టెంబర్ 3: అమెరికా అధ్యక్షుడిగా ఆసియా ఖండంలో చివరిసారి పర్యటిస్తూ జి-20 సమావేశంలో పాల్గొనేందుకు చైనా వెళ్లిన బరాక్ ఒబామా బృందానికి హాంగ్జౌ విమానాశ్రయంలో నిరసన సెగలు ఎదురయ్యాయి. ఒబామాతో పాటు అమెరికా జాతీయ భత్రదా సలహాదారు సుసాన్ రైస్, మరికొందరు ఇతర ముఖ్యమైన అధికారులు, పాత్రికేయులతో ‘ఎయిర్‌ఫోర్స్ వన్’ (అమెరికా అధ్యక్షుడి విమానం) హాంగ్జౌ విమానాశ్రయంలో దిగిన వెంటనే ఈ ఘటన చోటుచేసుకుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఒబామా, ఆయన బృందం ‘ఎయిర్‌ఫోర్స్ వన్’ నుంచి కిందికి దిగుతుండగా ముదురు రంగు సూట్ ధరించి అక్కడ ఉన్న చైనా అధికారులు వారిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో అమెరికా అధ్యక్ష భవన (వైట్ హౌస్) అధికారిణి ఒకరు రంగంలోకి దిగి, ‘ఇది అమెరికా విమానం.. అందులో అమెరికా అధ్యక్షుడి విమానం’ అంటూ కనె్నర్ర చేసినప్పటికీ చైనా అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు ‘ఇది మా దేశం.. మా విమానాశ్రయం.. మీరంతా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి’ అంటూ అమెరికా పాత్రికేయులను ఉద్ధేశించి ఆంగ్ల భాషలో బిగ్గరగా అరిచాడు. దీంతో ఆ అధికారిని అడ్డుకునేందుకు సుసాన్ రైస్‌తో పాటు ‘వైట్ హౌస్’ సీనియర్ ఉద్యోగి బెన్ రోడ్స్ ప్రయత్నించగా, వారిపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వాదులాటకు దిగాడు. ఆ తర్వాత అమెరికా గూఢచార విభాగ ఏజెంట్ ఒకరు రంగంలోకి దిగి చైనా అధికారిని పక్కకు నెట్టివేయడంతో ఒబామా వాహనశ్రేణి అక్కడి నుంచి ముందుకు సాగింది.