అంతర్జాతీయం

మార్కెట్లను కుదిపేస్తున్న బ్రెగ్జిట్ అనిశ్చితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్ : బ్రెగ్జిట్ అనిశ్చితి పరిస్థితి యూరోపియన్ మార్కెట్లను కుదిపేస్తోంది. ఎవరికివారు ఊహాగానాలు చేస్తుండడంతో స్టెర్లింగ్ విలువ తీవ్ర ఒడిదుడులకు లోనవుతోంది. బ్రెగ్జిట్ ఒప్పందాన్ని యూరోపియన్ యూనియన్ యథాతథంగా అమలు చేస్తుందా అన్నది అనుమానంగా మారింది. ప్రత్యేకించి గ్రేట్ బ్రిటన్ వైఖరి అగమ్యగోచరంగా ఉండడంతో మార్కెట్ స్థిరత్వాన్ని బలపడలేకపోతోంది. ఫోరెక్స్ మార్కెట్ డాలర్ విలువ ఒక్కోసారి ఎక్కువగాను, ఒక్కోసారి అతి తక్కువగాను నమోదవుతోంది.
అత్యంత కీలకమైన అంశాలపై యూరోపియన్ యూనియన్ సరైన నిర్ణయం తీసుకోకపోవడమే ప్రస్తుత అనిశ్చితి ప్రధాన కారణమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. లండన్ స్టాక్ ఎక్స్చేంజిలో పరిస్థితి దారుణంగా ఉందని మదుపర్లు వాపోతున్నారు. పాయింట్లు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితుల్లో లావాదేవీలను నిర్వహించాల్సి వస్తోందని సీఎంసీ మార్కెట్ విశే్లషకుడు డేవిడ్ మాడెన్ అన్నారు. బ్రెగ్జిట్ సమస్యకు ఎంత త్వరగా పరిష్కారం లభిస్తే మార్కెట్‌లు అంత త్వరగా కోలుకుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం, ఆసియా మార్కెట్‌ల తీరుతెన్నులు కూడా యూరోపియన్ యూనియన్ స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.