అంతర్జాతీయం

వేగంగానే భారత్ అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 18: దేశంలో అభివృద్ధి వేగంగానే దూసుకెళుతున్నదని, ఇందులో అనుమానాలకు తావులేదని భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం భారత్ వృద్ధిరేటు తగ్గుతుందని ఐఎంఎఫ్ ఇచ్చిన నివేదికపై ఆమె స్పందిస్తూ, చాలా దేశాలను గురించిన వివరాలు అందులో ఉన్నాయని తెలిపారు. 2018లో భారత్ వృద్ధిరేటు 6.8 శాతం ఉండగా, ఈ ఏడాది 7 శాతం నమోదవుతుందని భారత్ తొలుత అంచనా వేసింది. అయితే, దేశమంతా మాంద్యం నెలకొంటున్నదని, కాబట్టి వృద్ధి రేటు 6.1 శాతానికి మించదని ఐఎంఎఫ్ తన నివేదికలో స్పష్టం చేసింది. అయితే, 2020లో 7 శాతం వృద్ధిరేటును భారత్ సాధించే అవకాశాలు ఉన్నాయని ఆ నివేదికలో ఐఎంఎఫ్ పేర్కొంది. దీనిపై నిర్మలా సీతారామన్ స్పందిస్తూ, వృద్ధిరేటు అంశం ఎలావున్నప్పటికీ, భారత్‌లో అభివృద్ధి ఆశాజనకంగానే ఉందని అన్నారు. ఆర్థిక మాంద్యం ప్రస్తుతం యావత్ ప్రపంచ దేశాల్లో విస్తరించి ఉందని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, అడ్డంకులను అధిగమించి, భారత్ ముందుకు దూసుకెళుతున్నదని అన్నారు. ఒక ప్రశ్నపై స్పందిస్తూ, చైనాతో పోల్చుకోవడం లేదని తెలిపారు. పోలిక సరైనది కాదని ఆమె వ్యాఖ్యానించారు.
8 శాతం వృద్ధిరేటును అందుకోవాలన్న లక్ష్యంతోనే ముందుకు వెళుతున్నామని అన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటనే విషయాన్ని మరచిపోకూడదని అన్నారు. ఐఎంఎఫ్ నివేదిక కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని అన్నారు. భారత ఆర్థిక పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని ఆమె వ్యాఖ్యానించారు.