అంతర్జాతీయం

కలసి నడుద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనీలా, అక్టోబర్ 18: భారత్, ఫిలిప్పీన్స్ మధ్య శుక్రవారం ఇక్కడ రక్షణకు సంబంధించి నాలుగు కీలకమైన ఒప్పందాలు జరిగాయి. రక్షణ, నౌకాయాన భద్రత భాగస్వామ్యం, ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసి పనిచేయాలని ఇరుదేశాలు ప్రతిజ్ఞ చేశాయి. మనీలాలోని మాలాకనాన్ ప్యాలెస్‌లో భారత రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డుటెర్టే మధ్య విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. అధ్యక్ష భవన్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కీలకమైన నాలుగు ఒడంబడికలు చేసుకున్నారు.‘ రొడ్రిగోతో ఫలవంతమైన చర్చలు జరిపాను. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం కొనసాగించాలని నిర్ణయించాం. ప్రపంచం అలాగే ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలు మా మధ్య ప్రస్తావనకు వచ్చాయి’అని రాష్టప్రతి కోవింద్ వెల్లడించారు. నాలుగు ఒప్పందాలపై సంతాలు జరిగిన తరువాత ఆయన మాట్లాడుతు భద్రత, పర్యాటకం, సైన్స్ అండ్ టెక్నాలజీ, సాంస్కృతికం అలాగే సముద్ర జలాలకు సంబంధించిన అంశాలు ఒప్పందంలో చోటుచేసుకున్నాయని వెల్లడించారు. ఫిలిప్పీన్స్‌లో ఐదు రోజుల పర్యటన నిమిత్తం రాష్టప్రతి కోవింద్ గురువారం ఇక్కడకు వచ్చారు. ‘ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మొదలై 70 ఏళ్లు అవుతున్న సందర్భంగా నేను జరుపుతున్న ఈ పర్యటన ఓ మైలురాయిగా మిగిలిపోతుంది’అని ఆయన పేర్కొన్నారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగోతో కలిసి కోవింద్ ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలన్న ఆకాంక్షను కోవింద్ వ్యక్తం చేశారు. ‘రక్షణ, భద్రత రంగంలోనూ, ఉగ్రవాదంపై పోరు, వ్యాపార-వాణిజ్య రంగంలో పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాం’ అని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. భారత్- ఫిలిప్పీన్స్ ఉగ్రవాద బాధిత దేశాలని, దానిపై ఉమ్మడి పోరు చేయాలని ఇరువురు అధినేతలు పిలుపునిచ్చారు. సీమాంతర ఉగ్రవాదంపై అలుపెరుగని పోరాటం చేయాలని నిర్ణయించారు. దేశ సార్వభౌమాధికారాలను గౌరవించుకుంటూ అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా పనిచేయాలని అన్నారు. రెండు దేశాలు సహజ మిత్రులేనన్న కోవింద్ అనేక రంగాల్లో పరస్పర సహకారం కొనసాగుతుందని ప్రకటించారు.
శుక్రవారం చేసుకున్న నాలుగు ఒప్పందాల్లో కీలకమైంది మారిటైం. ఫిలిప్పీన్స్ కోస్ట్‌గార్డ్, భారత నౌకాదళం పరస్పరం సహకరించుకుంటాయి. రక్షణ రంగం ఆధునీకరణ, వౌలిక వసతుల కల్పనలో ఫిలిప్పీన్స్‌కు సహాయసహకారాలు అందిస్తామని కోవింద్ ప్రకటించారు. అలాగే పెట్టుబడులకు భారత్ అనుకూలమని, అభివృద్ధిలో దూసుకుపోతోందని ఆయన చెప్పారు.