అంతర్జాతీయం

బ్రెగ్జిట్‌పై చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, అక్టోబర్ 19: ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్‌ను విడదీసేందుకు ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ చేసిన ప్రయత్నాలకు చుక్కెదురైంది. ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు 37 సంవత్సరాల తర్వాత బ్రిటన్ పార్లమెంటు శనివారం సమావేశమైనా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఐరోపాయ యూనియన్‌తో బోరీస్ జాన్సన్ కుదుర్చుకున్న బ్రెగ్జిట్ ఒప్పందాన్ని వాయిదా వేయడానికే ఎంపీలు మొగ్గు చూపారు. ఆయన ప్రతిపాదనకు వ్యతిరేకంగా 322 ఓట్లు, అనుకూలంగా 306 ఓట్లు వచ్చాయి. దీంతో అక్టోబర్ 31 కల్లా బ్రెగ్జిట్ ఒప్పందం ఖరారు కావాలన్న డెడ్‌లైన్ వాయిదా పడే పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఎంపీలందరూ తమ మెజారిటీ ద్వారా బ్రెగ్జిట్ డెడ్‌లైన్‌ను వాయిదా వేయడానికే మొగ్గు చూపడంతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చినట్లయ్యింది. ఈ నెల 19వ తేదీ కటాఫ్ నాటికి కొత్త ఒప్పందం ఏదీ సాధ్యం కాకపోవడంతో అసలు ఒప్పందం డెడ్ లైన్‌ను మార్చాల్సిందేనంటూ ఎంపీలు తమ ఓటు ద్వారా స్పష్టం చేశారు. అయితే తాము చట్ట ప్రకారమే వ్యవహారిస్తామని ప్రధాని జాన్సన్ ఆయన వర్గీయలు ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో వారి తదుపరి వ్యూహం ఏమిటన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. శనివారం ఓటింగ్ ముగిసిన తర్వాత మాట్లాడిన ప్రధాని బ్రెగ్జిట్‌పై అక్టోబర్ 31 డెడ్‌లైన్‌ను పొడిగించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇందు కోసం తాను శాయశక్తులా కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. అక్టోబర్ 31 డెడ్‌లైన్‌కు అనుగుణంగా పార్లమెంటులో అవసరమైన శాసనాన్ని ఆమోదించే వరకు ఈ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్ళేందుకు వీల్లేదంటూ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ అల్వీర్ లెట్విన్ చేసిన సవరణ ప్రతిపాదనను మెజారిటీ ఎంపీలు బలపరిచారు. ప్రధాని బోరీస్ జాన్సన్ ఆలోచనలను తాము సమర్థించడం లేదన్న స్పష్టమైన సంకేతాన్ని ఈ తీర్పు ద్వారా ఎంపీలు అందించారు. ఓటింగ్ సందర్భంగా మాట్లాడిన జాన్సన్ ‘బ్రెగ్జిట్ ఒప్పందంపై అందరూ కలిసి రావాలి. దీనిపై కొన్ని ఏళ్ళుగా జరుగుతున్న ఎడతెగని వివాదానికి స్వస్తి పలకాలి’ అని స్పష్టం చేశారు. బ్రిటిష్ పార్లమెంటు శనివారం సమావేశం కావడం అన్నది చాలా అరుదుగా జరుగుతుంది. 1982లో ఫాక్‌ల్యాండ్స్ యుద్ధానికి సంబంధించి అప్పటి ప్రధాని మార్గరెట్ థాచర్ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్ జరిపేందుకు శనివారం సమావేశాన్ని నిర్వహించారు. ఆ తర్వాత శనివారం సమావేశం జరగడం అన్నది బ్రెగ్జిట్ విషయంలోనే జరిగింది. బోరి జాన్సన్ కుదుర్చుకున్న ఒప్పందంపై తాజాగా ప్రజాభిప్రాయాన్ని చేపట్టాలని లేదా మళ్లీ ఓటింగ్ జరపాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది ప్రజలు సెంట్రల్ లండన్‌కు చేరుకున్నారు.

*చిత్రాలు..బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ (ఇన్‌సెట్‌లో)
* మళ్లీ ప్రజాభిప్రాయాన్ని సేకరించాల్సిందేనంటూ సెంట్రల్ లండన్‌కు శనివారం వేలాదిగా తరలివచ్చిన ప్రజలు