అంతర్జాతీయం

శరవేగంగా వాణిజ్య చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 20: వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత్-అమెరికా మధ్య జరుగుతున్న చర్చలు శరవేగంతో ముందుకు సాగుతున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ అంశంపై త్వరలోనే కీలక ఒప్పందం కుదరగలదన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.
ఇక్కడి అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రధాన కార్యాలయంలో అమెరికా ఆర్థిక మంత్రి స్టీవెన్ మ్యుచిన్‌తో సీతారామన్ జరిపిన చర్చల సందర్భంగా ఈ వాణిజ్య ఒప్పందం చర్చలు ప్రస్తావనకు వచ్చాయి. అమెరికా ఆర్థిక మంత్రితో జరిపిన చర్చల్లో తాను సంక్షిప్తంగా ఈ వాణిజ్య చర్చల అంశాన్ని ప్రస్తావించానని, దీనిపై అమెరికా వాణిజ్య మంత్రి, వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లితిజర్ కృషి చేస్తున్నారని సీతారామన్ తెలిపారు. తన అంచనాలను బట్టి ఈ వాణిజ్య చర్చలు బలాన్ని పుంజుకున్నాయని, ఇరు వర్గాల మధ్య త్వరలోనే ఒప్పందం కుదరగలదన్న నమ్మకం బలపడుతోందని ఆమె తెలిపారు. సామాజిక భద్రత, మెడికేర్‌కు సంబంధించి ద్వంద్వ పన్నుల విధానాన్ని తొలగించే దిశగా రెండు దేశాలు కృషి చేస్తున్నాయని అన్నారు. టోటలైజేషన్‌గా పేర్కొనే ఈ ప్రతిపాదనకు సంబంధించి భారత్ ఇంతవరకు స్పందించకపోవడానికి కారణం తమ దేశంలో సామాజిక బీమా విధానం లేకపోవడమేనని ఆమె అన్నారు. భారత్‌లోని అనేక కుటుంబాలు, ఒక స్థాయి ఆదాయం కలిగిన వ్యక్తులకు ఆయుష్మాన్ భారత్ అండగా నిలుస్తోందని ఆమె తెలిపారు. బీమా కవరేజికి సంబంధించి ప్రైవేటు రంగంలోనూ ఎన్నో అవకాశాలున్నాయని ఆమె తెలిపారు. అమెరికా ఆర్థిక మంత్రితో సీతారామన్ జరిపిన చర్చలు ఫలప్రదంగా సాగాయని, వచ్చే నెలలో అమెరికా ఆర్థిక మంత్రి భారత పర్యటన సందర్భంగా కూడా వీరిమధ్య సమావేశం జరుగుతుందని ఓ అధికారిక ప్రకటనలో తెలిపారు. కొన్ని రకాల ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాల నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని భారత్ డిమాండ్ చేస్తోంది. అలాగే, జీఎస్పీ కింద కొన్ని రకాల దేశీయ ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశాన్ని కల్పించాలని వ్యవసాయం, ఆటోమొబైల్, ఆటో విడిభాగాలు, ఇంజనీరింగ్ వంటి రంగాలకు సంబంధించిన భారత ఎగుమతులకు అమెరికా మార్కెట్‌ను మరింతగా అందుబాటులోకి తేవాలని అమెరికా నాయకత్వాన్ని భారత్ గట్టిగానే కోరుతోంది. వీటన్నింటిపైనే ఇరు దేశాల మధ్య తాజాగా వాణిజ్య చర్చలు మొదలయ్యాయి. ఇందులో భాగంగానే అమెరికా అర్థిక మంత్రి స్టీవెన్ మ్యునిచ్ వచ్చే నెల మొదట్లో భారత్‌కు కూడా రానున్నారు. భారత డిమాండ్లు ఇలావుంటే, అమెరికా కూడా తమ వ్యవసాయ, పాడి, వైద్య రంగాలకు సంబంధించిన ఉత్పత్తులకు భారత మార్కెట్‌లో అవకాశం కల్పించాలని కోరుతోంది. అలాగే, కొన్ని ఐసీటీ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించాలని డిమాండ్ చేస్తోంది. ముఖ్యంగా భారత్‌తో ఉన్న వాణిజ్య లోటు పట్ల అమెరికా నాయకత్వం ఆందోళన చెందుతోంది. 2018-19లో అమెరికాకు భారత ఎగుమతులు 52.4 బిలియన్ డాలర్ల మేర ఉంటే, అమెరికా నుంచి భారత్ దిగుమతులు 35.5 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. ఈ వాణిజ్య లోటును తగ్గించుకునే చర్యల్లో భాగంగా తమ ఉత్పత్తులకు మార్కెట్ ద్వారాలు తెరవాలని భారత్‌ను అమెరికా కోరుతోంది.
*చిత్రం...అమెరికా ఆర్థిక మంత్రి స్టీవెన్ ముచిన్‌తో నిర్మలా సీతారామన్ చర్చలు