అంతర్జాతీయం

12 ఒప్పందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనోయ్, సెప్టెంబర్ 3: ప్రధాని నరేంద్ర మోదీ వియత్నాం పర్యటన సందర్భంగా ఇరు దేశాలు వివిధ రంగాల్లో సహకారానికి సంబంధించి 12 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ప్రధాని మోదీ, వియత్నాం ప్రధాని ఎన్గుయెన్ జువాన్‌ల సమక్షంలో ఇరుదేశాల అధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. వియత్నాం కోస్ట్ గార్డు కోసం మన దేశానికి చెందిన ఎల్ అండ్ టి సంస్థ హైస్పీడ్ గస్తీ బోట్లను నిర్మిస్తుంది. ఇందుకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. నౌకా రవాణాకు సంబంధించిన సమాచారాన్ని భారత్, వియత్నాం నౌకాదళాలు పరస్పరం ఇచ్చి పుచ్చుకుంటాయి. అలాగే రోదసీ అనే్వషణ, శాంతియుత అవసరాల కోసం అంతరిక్షాన్ని ఉపయోగించుకోవడంలో సహకారానికి సంబంధించి కూడా ఇరుదేశాలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఐక్యరాజ్య సమితి శాంతిపరక్షణ కార్యక్రమాల్లో పరస్పర సహకారానికి సంబంధించి కూడా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అలాగే ద్వంద్వ పన్నుల రద్దు, ఆరోగ్యం, ఐటి రంగాల్లో సహకారం, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కూడా ఒప్పందాలు కుదిరాయి. ఇవేకాకుండా వియత్నాం అకాడమీ ఆఫ్ సోషల్ సైన్స్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ మధ్య, ప్రమాణాల పరస్పర గుర్తింపునకు సంబంధించి మన దేశానికి చెందిన బిఐఎస్, వియత్నాంకు చెందిన ‘స్టామెక్’ మధ్య అవగాహనా ఒప్పందాలపైనా సంతకాలు జరిగాయి. ఐటి వౌలిక సదుపాయాలు, ఐటి శిక్షణకు సంబంధించి ఒక ఒప్పందం, 2017 సంవత్సరాన్ని ‘ఇయర్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్’గా జరుపుకోవడానికి సంబంధించి మరో ఒప్పందం కూడా కుదిరాయి.