అంతర్జాతీయం

‘కర్తార్‌పూర్’ ఒప్పందంపై నేడు సంతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, అక్టోబర్ 23: కర్తార్‌పూర్ కారిడార్‌ను ఉపయోగంలోకి తీసు కు రావడానికి సంబంధించి భారత్‌తో చరిత్రాత్మక ఒప్పందంపై ఇరు దేశాలు గురువారం సంతకాలు చేసే అవకాశం ఉందని పాకిస్తాన్ బుధవారం తెలిపింది. భారత్‌లోని పంజాబ్ రాష్ట్రంలో గల డేరా బాబా నానక్ ఆలయాన్ని పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌లో గల గురుద్వారాను ఈ కారిడార్ అనుసంధానం చేస్తోంది. అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం నాలుగు కిలో మీటర్ల దూరంలో పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని నరోవల్ జిల్లాలో కర్తార్‌పూర్ ఉంది. కర్తార్‌పూర్ ఒప్పందంపై బుధవారం సంతకాలు చేయాలని ఇరు దేశాలు తొలుత అంగీకారానికి వచ్చాయి. ‘ఒప్పందంపై రేపు సంతకాలు కావడానికి మేము కృషి చేశాము’ అని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్ ఫైసల్ బుధవారం నాడిక్కడ విలేఖరులకు తెలిపారు. భారత్ నుంచి యాత్రికులు ఉదయం వేళ వచ్చి గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను దర్శించుకున్న తరువాత సాయంత్రం తిరిగి వెళ్లడానికి ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరిందని ఆయన పేర్కొన్నారు. ప్రతి రోజు అయిదు వేల మంది యాత్రికులను ఈ పవిత్ర స్థలాన్ని దర్శించడానికి అనుమతించడం జరుగుతుందని ఆయన వివరించారు. ప్రతి యాత్రికుడు 20 డాలర్ల చొప్పున రుసుము చెల్లించవలసి ఉంటుందని ఫైసల్ వివరించారు. ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేసిన తరువాత దానిలోని మరిన్ని వివరాలను వెల్లడించడం జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రతి యాత్రికుడికి 20 డాలర్ల చొప్పున సేవా రుసుము విధించాలని పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించిన భారత్ ఇప్పుడు ఒప్పందంపై సంతకం చేయబోతోంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖలోని ఒక జాయింట్ సెక్రెటరి స్థాయి అధికారి గురువారం కర్తార్‌పూర్ కారిడార్ స్థలం సమీపంలోని జీరో పాయింట్ వద్ద పాకిస్తాన్ అధికారులను కలుస్తారని, భారత్ తరపున ఆయన అవగాహనా ఒప్పందంపై సంతకం చేస్తారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం ఢిల్లీలో ప్రకటించింది. కర్తార్‌పూర్ కారిడార్‌ను నవంబర్ నెల తొలినాళ్లలో ఉపయోగంలోకి తేవాలని భారత్, పాకిస్తాన్‌లు ప్రణాళిక రూపొందించాయి.