అంతర్జాతీయం

ట్రంప్‌కు రష్యా వత్తాసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 6: గతంలో ఎన్నడూలేని విధంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ప్రభావితం చేయడానికి రష్యా ప్రయత్నిస్తోందని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు విజయాన్ని చేకూర్చే లక్ష్యంతోనే తమ దేశ అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు. అమెరికాకు అంతర్జాతీయంగా ప్రత్యర్థిగా ఉన్న ఒక దేశం ఈ విధంగా తమ ఎన్నికల్లో జోక్యం చేసుకోడం అన్నది చాలా తీవ్రమైన పరిణామం అని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికయ్యేలా చూసేందుకు రష్యా ఈ విధంగా ప్రయత్నిస్తుందా అన్న ప్రశ్నకు‘ఎప్పుడైతే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ నియమితుడయ్యారో అప్పటి నుంచి రష్యా జోక్యం ప్రస్పుటంగా కనిపిస్తునే వస్తోంది’అని హిల్లరీ అన్నారు. మొదటి నుంచీ కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ విధానాలకు ట్రంప్ మద్దతు ఇస్తునే వచ్చారని ఆమె గుర్తుచేశారు. రష్యా జోక్యానికి సంబంధించి అమెరికా ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు నిఘా పెట్టినట్టుగా అమెరికా పత్రికల్లో కథనాలు వెలువడిన విషయాన్ని హిల్లరీ గుర్తుచేశారు. వాషింగ్టన్ పోస్ట్‌లో మొదట ఈ కథనం ప్రచురితమైందని పేర్కొనడమే కాకుండా ఆ వార్తను అత్యంత విశ్వసనీయమైనదిగా హిల్లరీ అభివర్ణించారు.