అంతర్జాతీయం

ట్రక్కులో 39 శవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: ఓ ట్రక్కులో 39 శవాలు తీసుకెళుతుండగా తూర్పు లండన్‌లోని ఎస్సెక్స్ పోలీసులు చూసి నిర్ఘాంతపోయారు. వెంటనే ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మృతి చెందిన 39 మందిలో ఒక 25 ఏళ్ళ యువకుడు ఉండగా, మిగతా వారంతా వయస్సులో పెద్దవారేనని పోలీసులు గుర్తించారు. తూర్పు లండన్‌లోని ఓ పారిశ్రామిక పార్కులో జరిగిన ఘటనలో వీరంతా మరణించినట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు. అయితే ఇంకా సమగ్ర విచారణ జరగాల్సి ఉందని ఎస్సెక్స్ పోలీసు చీఫ్ సూపరింటెండెంట్ ఆండ్రీవ్ మన్నార్ బుధవారం చెప్పారు. ఈ విషయం తెలుసుకుని తాను భయపడ్డానని బ్రిటీషు ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తెలిపారు.
ఒకేసారి ఇంత మంది మరణించడం దిగ్భ్రాంతి చెందానని, మనోవేదనకు గురయ్యానని ఆయన పేర్కొన్నారు. మరణించిన వారికి సంతాపం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రతి రోజూ తనకు హోం శాఖ కార్యాలయం నుంచి తాజా పరిస్థితులు తెలియజేస్తుంటారని, ఎస్సెక్స్ పోలీసుల నుంచి వచ్చిన సమాచారం తెలుసుకుని చాలా బాధ పడ్డానని ఆయన చెప్పారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు ఎంతో దుఖంలో ఉంటారని ఆయన తెలిపారు. ఈ దురదృష్టకర సంఘటనపై పూర్వాపరాలు తెలియాల్సి ఉందన్నారు. వాటర్‌గ్లేడ్ పారిశ్రామిక పార్కులో జరిగిన దుర్ఘటనలో మరణించిన వారిని గుర్తించే ప్రక్రియ ప్రారంభించినట్లు బోరిస్ జాన్సన్ తెలిపారు. దీనికి కొంత సమయం పడుతుందన్నారు. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని వాస్తవాలు తెలుసుకునేందుకు విచారణ చేపట్టారని ఆయన వివరించారు.