అంతర్జాతీయం

9నుంచి ఉపయోగంలోకి ‘కర్తార్‌పూర్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్/ డేరా బాబా నానక్: భారత్, పాకిస్తాన్ గురువారం కర్తార్‌పూర్ కారిడార్‌ను ఉపయోగంలోకి తెచ్చే చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిని ఉన్నప్పటికీ, కర్తార్‌పూర్ కారిడార్‌ను ఉపయోగంలోకి తెచ్చే ఒప్పందం కుదరడం విశేషం. ఈ ఒప్పందం వల్ల భారత్‌లోని సిక్కు యాత్రికులు పాకిస్తాన్‌లోని పవిత్రమైన దర్బార్ సాహిబ్‌ను సందర్శించడానికి వీలు కలుగుతుంది. భారత్‌లోని పంజాబ్ రాష్ట్రంలో గల డేరా బాబా నానక్ ఆలయాన్ని పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌లో గల దర్బార్ సాహిబ్‌తో కలుపుతుంది. అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం నాలుగు కిలో మీటర్ల దూరంలో పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గల నరోవల్ జిల్లాలో కర్తార్‌పూర్ ఉంది. అంతర్జాతీయ సరిహద్దు వద్ద గల కర్తార్‌పూర్ జీరో పాయింట్ వద్ద ఒప్పందంపై సంతకాలు చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్తార్‌పూర్ కారిడార్‌ను ఉపయోగంలోకి తేవడానికి న్యాయపరమైన అడ్డంకిని తొలగించేందుకు జీరో పాయింట్ వద్ద సంతకాలు చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత్‌లోని సిక్కు కమ్యూనిటి చాలా కాలంగా కర్తార్‌పూర్ కారిడార్‌ను తెరవాలని డిమాండ్ చేస్తూ వస్తోంది. భారత్ తరపున కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరి ఎస్‌సీఎల్ దాస్, పాకిస్తాన్ తరపున ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్ ఫైసల్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందంపై సంతకాలు చేసిన తరువాత ఫైసల్ మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఏడాది కాలంలో కారిడార్‌ను పూర్తి చేసి తన హామీని నెరవేర్చుకున్నారని అన్నారు. ‘కర్తార్‌పూర్ కారిడార్‌పై ఒప్పందం కుదుర్చుకోవడం అంత సులభమైన విషయం కాదు. పైగా భారత్‌తో మా సంబంధాలు దెబ్బతిన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే ఆ దేశంతో సంప్రదింపులు జరపడం కష్టతరమే కాకుండా జటిలమైనది కూడా’ అని ఫైసల్ అన్నారు. ఈ ఒప్పందం ప్రకారం, కారిడార్ వారంలో ఏడు రోజులూ ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరిచి ఉంటుంది. ప్రతి రోజు 5000 మంది వరకు భారతీయ యాత్రికులు రావడానికి వీలు ఉంటుంది. అయితే, వారు అదే రోజు తిరిగి వెళ్లిపోవాలి. యాత్రికులు తమ గుర్తింపు కోసం తమ వెంట పాస్‌పోర్ట్‌ను తెచ్చుకోవాలి. భారత్ పది రోజుల ముందుగానే యాత్రికుల జాబితాను పాకిస్తాన్‌తో పంచుకుంటుందని ఫైసల్ వివరించారు. ప్రతి యాత్రికుడు 20 డాలర్ల చొప్పున రుసుము చెల్లించవలసి ఉంటుంది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కర్తార్‌పూర్ కారిడార్‌ను నవంబర్ తొమ్మిదో తేదీన లాంఛనంగా ప్రారంభిస్తారు. నవంబర్ 12వ తేదీన గురు నానక్ దేవ్ 550వ జయంతి ఉత్సవం జరుగుతుంది.