జాతీయ వార్తలు

కాబూల్‌లో బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, సెప్టెంబర్ 6: ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ పేలుళ్లు, కాల్పులతో దద్దరిల్లిపోయింది. దాదాపు 25మంది ఈ తాలిబన్ ఉగ్రదాడుల్లో మృతి చెందారు. డజన్లకొద్దీ ప్రజలు గాయపడ్డారు. రక్షణశాఖ కార్యాలయానికి సమీపంలో రెండు బాంబులను పేల్చిన తాలిబన్‌లు, కేర్ ఇంటర్నేషనల్‌పై దాడికి పూనుకున్నారు. తాలిబన్లకు, ప్రభుత్వ సైన్యానికి మధ్య గంటల తరబడి కాల్పులు జరిగాయి. పది మంది విదేశీయులతో సహా మొత్తం 42మందిని కాపాడినట్లు కేర్ ఇంటర్నేషనల్ ప్రతినిధి తెలిపారు. కాల్పులకు తెగబడిన ముగ్గురు తాలిబన్లను హతమార్చినట్లు పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో 91మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ‘ ఆఫ్గనిస్తాన్ శత్రువులు సైన్యంతో, భద్రతాబలగాలతో పోరాడే శక్తి కోల్పోయారు. అందుకే వాళ్లు దొడ్డిదారిన దాడులకు దిగుతున్నారు.’ అని ఆఫ్గనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని అన్నారు.