అంతర్జాతీయం

సహకారాన్ని పెంచుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియాద్, అక్టోబర్ 29: వివిధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునే అంశంపై భారత్- సౌదీ అరేబియా మధ్య మంగళవారం ఇక్కడ విస్తృత చర్చలు జరిగాయి. సౌదీ అరేబియాకు చెందిన అనేకమంది సీనియర్ మంత్రులు భారత ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకుని పరస్పర సహకారాన్ని ఏవిధంగా పెంపొందించుకోవాలన్న దానిపై మంతనాలు సాగించారు. ఇంధనం, వ్యవసాయం, జల టెక్నాలజీపై ఈ ద్వైపాక్షిక చర్చలు సాగాయి. భారత ప్రధాని మోదీతో ఫలప్రదమైన చర్చలు జరిపినట్టు సౌదీ ఇంధనం మంత్రి, యువరాజు అబ్దుల్లా జిజ్ బిన్ సల్మాన్ తెలిపారు. రెండు దేశాల మధ్య ఇంధన సహకారాన్ని పెంపొందించుకోవడంపై తాము మాట్లాడామని ఆయన తెలిపారు. మహారాష్టల్రోని రాయగఢలో వెస్ట్‌కోస్ట్ రిఫైనరీ ప్రాజెక్టుపై ముందుకు వెళ్లాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత చేకూరింది. ఈ ప్రాజెక్టులో సౌదీ అరేబియాకు చెందిన ఆరంకో సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టడానికి, అలాయే యూఏఈకి చెందిన అబుదాబి కంపెనీతోపాటు పలు భారత ప్రభుత్వరంగ కంపెనీలు ఇందులో పెట్టుబడులు పెట్టనున్నాయి. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఇంధన వినియోగ దేశమైన భారత్ 83 శాతం తన అవసరాలను దిగుమతుల ద్వారానే తీర్చుకొంటోంది. అత్యధిక స్థాయిలో ఇరాక్, రెండో స్థానంలో సౌదీ అరేబియా భారత్‌కు ఇంధనాన్ని సరఫరా చేస్తున్నాయి. సౌదీ అరేబియా పర్యావరణ, జల, వ్యవసాయ మంత్రులతో కూడా భారత ప్రధాని చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. సౌదీ అరేబియా కార్మిక, సామాజిక శాఖ మంత్రి అహమ్మద్ బిన్ సులేమాన్‌తో కూడా భారత ప్రధాని సమావేశమయ్యారని, కార్మిక అంశాలపై వీరి మధ్య చర్చలు జరిగాయని ఆయన తెలిపారు. సౌదీ అరేబియాలో 2.6 మిలియన్ల మంది భారతీయులు నివసిస్తున్నారు.
*చిత్రం...జోర్డాన్ రాజు అబ్దుల్లాతో మంగళవారం రియాద్‌లో సమావేశమైన భారత ప్రధాని నరేంద్ర మోదీ..
*అబ్దుల్లాతో ప్రధాని ఆత్మీయ ఆలింగనం (ఇన్‌సెట్‌లో )