అంతర్జాతీయం

మీ సంగతి చూసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, సెప్టెంబర్ 6: అద్దాలమేడలో కూర్చుని ఎదుటవారిపై రాళ్లు విసరడం మానుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వానికి భారత్ సలహా ఇచ్చింది. కాశ్మీర్ తమ అంతర్గత వ్యవహారమని భారత్ పునరుద్ఘాటించింది. బలూచీస్తాన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిని పాక్‌లోని భారత హైకమిషనర్ గౌతం బంబావాలే సమర్ధించారు. కొన్ని విషయాల్లో ఇరుదేశాలకు కొన్ని సమస్యలున్నాయని, అయితే పాకిస్తాన్ తన లోపాలను సమీక్షించుకోకుండా పక్కవారిపై ఆరోపణలు చేయడం సరైందికాదని ఆయన చెప్పారు.‘అద్దాల మేడలో ఉంటూ కొందరు అదేపనిగా ఎదుటవారిపై రాళ్లు విసురుతున్నారు. ఇదెంత మాత్రం సరైందికాదు. కాశ్మీర్ మా అంతర్గత వ్యవహారమే’అని ఆయన స్పష్టం చేశారు. తమ ఇంటిని చక్కదిద్పుకోకుండా ఎదుటవారిపై విమర్శలు చేయడం తగదని ఆయన గట్టిగానే చెప్పారు.‘ముందు మీ ఇంటి సమస్యను పరిష్కరించుకోండి. తరువాత ఇతరులకు నీతులు చెబుదురుగాని’అని ఆయన సలహా ఇచ్చారు. విదేశీ సంబంధాలపై కరాచీలో జరిగిన ఓ ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడిన బంబావాలే‘ఉగ్రవాదం సహా అనేక సమస్యలు ఇరుదేశాలకు ఉన్నాయి. వీటన్నంటిపై సమష్టిగా పోరాడదాం అని భారత్ అనేక సార్లు పాక్‌ను కోరింది’అని అన్నారు. వీటన్నింటీని పక్కన బెట్టి ఎదుటవారిపై బురద జల్లడానికి పూనుకోవడం తగదని పాక్ పాలకులు హైకమిషనర్ హితవుచెప్పారు. కాగా నవంబర్‌లో ఇస్లామాబాద్‌లో జరిగే సార్క్ శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని ఆయన వెల్లడించారు. ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సడలించే దిశగా ప్రయత్నాలు సాగాలని, దీనికి పాక్ సహకరించాలని ఆయన తెలిపారు.