అంతర్జాతీయం

గురునానక్ స్మారక నాణెం విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, అక్టోబర్ 30: గురునానక్ 550 జయంతి సందర్భంగా పాకిస్తాన్ ప్రభుత్వం ఓ స్మారక నాణెం విడుదల చేసింది. సిక్కుమత స్థాపకుడు గురునానక్ జయంతి నవంబర్ 12న జరుగుతోంది. బుధవారం స్మారక నాణెం విడుదల చేసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తన ఫేస్‌బుక్‌లో నాణెం గుర్తును పెట్టారు. ‘గురనానక్ దేవ్‌జీ 550 జయంతి సందర్భంగా ఆయన స్మారక నాణెం మేం విడుదల చేశాం’అని ప్రధాని ఇమ్రాన్ స్పష్టం చేశారు. కర్తార్‌పూర్ కారిడార్ ఈనెల 9న ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రారంభించిననున్నారు. దీనికి ముందుగా స్మారక నాణెం విడుదల చేశారు. ఈ ఏడాది అంతా ఆయన జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు. సిక్కుల ఆది గురువు గురునానక్ సాహిబ్ పాకిస్తాన్‌లోని నాన్‌కనా సాహిబ్‌లో జన్మించారు. చారిత్రక గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను కలుపుతూ కర్తార్‌పూర్ కారిడార్‌కు భారత్- పాకిస్తాన్‌లు అంగీకరించాయి. గత నవంబర్‌లో దీనికి అంకురార్పణ జరిగింది. పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్ పట్టణాన్ని పంజాబ్ గురుదాస్‌పూర్ జిల్లా డేరాబాబా నానక్‌ను కలుపుతూ కారిడార్ నిర్మించారు. కర్తార్‌పూర్ సాహిబ్ పాకిస్తాన్‌లోని నరోవాల్ జిల్లాలో రావి నదిని ఆనుకుని ఉంది. డేరాబాబా నానక్ నుంచి నాలుగు కిలోమీటర్లు కారిడార్ సాగుతుంది. కర్తార్‌పూర్ కారిడార్ వెంట పాకిస్తాన్ 80 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేసింది. పవిత్ర ఆలయానికి తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ ఏర్పాట్లు చేశారు. గురునానక్ దేవ్ ఆలయాన్ని సందర్శించేందుకు ఎలాంటి వీసా అక్కర్లేదు. ఈమేరకు ఇరుదేశాల అధికారులు గత వారం ఓ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగంగా రోజుకు ఐదువేల మందిని అనుమతిస్తారు. పాకిస్తాన్‌లోని గురుద్వారా సాహిబ్‌లో గురునానక్ 18 ఏళ్లు గడిపారు.