అంతర్జాతీయం

ఆస్ట్రేలియా కార్చిచ్చులో కోలా ఎలుగుబంట్లు మృతి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్యాన్‌బెర్ర, అక్టోబర్ 30: ఆస్ట్రేలియా తూర్పు తీరంలో గల అడవికి అంటుకున్న మంటల్లో కోలా జాతికి చెందిన వందలాది ఎలుగు బంట్లు మరణించి ఉంటాయని అటవీ సంరక్షణాధికారులు ఆందోళన చెందుతున్నారు. అడవి మంటల బారి నుంచి బయటపడిన వాటి కోసం గురువారం నుంచి శోధన మొదలు పెట్టవచ్చని పోర్ట్ మాక్యురీలోని ఆసుపత్రి అధ్యక్షుడు సు అష్టన్ తెలిపారు. శుక్రవారం అడవిలో మంటలు చెలరేగాయని, క్రమేణా విస్తరించి 300 కిలో మీటర్లు (190 మైళ్ళు) ఉత్తర సిడ్ని వైపు దట్టంగా వ్యాపించాయని చెప్పారు. అంటే సుమారు రెండు వేల హెక్టార్లు (4,900 ఎకరాలు) అటవీ ప్రాంతం ఆహుతి అయ్యిందని అంచనా వేశామని ఆమె తెలిపారు. 50 శాతం ఎలుగుబంట్లు మరణించి ఉంటాయని, మిగతా 50 శాతం (సుమారు 350) బతికి ఉండవచ్చని అంచనా వేస్తున్నామని చెప్పారు. మంటలు వ్యాపించడంతో ఎలుగుబంట్ల అరుపులు వినిపించాయని అన్నారు. ఈ దుర్ఘటన తమను ఎంతో బాధించిందని తెలిపారు.