అంతర్జాతీయం

సిక్కు యాత్రికులకు పాస్‌పోర్ట్ అక్కర్లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, నవంబర్ 1: కర్తార్‌పూర్‌కు వచ్చే భారతీయ సిక్కు యాత్రికులకు ఎలాంటి పాస్‌పోర్ట్ ఉండాల్సిన అవసరం లేదని, కేవలం చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుందని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం ప్రకటించారు. కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను సందర్శించేందుకు పది రోజుల ముందు తమ పేర్లు నమోదు చేసుకోవలసిన అవసరం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. గురు నానక్ దేవ్ 550వ జయంతి సమీపిస్తున్న సమయంలో పాకిస్తాన్ ప్రధాని ఈ సానుకూల ప్రకటన చేశారు. కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభిస్తున్న నవంబర్ తొమ్మిదో తేదీన, సిక్కుల గురువు నానక్ దేవ్ 550వ జయంతి రోజున కర్తార్‌పూర్‌లోని సిక్కుల పవిత్ర ఆలయాన్ని సందర్శించే యాత్రికులు 20 డాలర్ల రుసుము కూడా చెల్లించవలసిన అవసరం లేదని ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం ఉదయం సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు. యాత్రికులకు ఎలాంటి రుసుము విధించొద్దని భారత్ కోరినప్పటికీ, ఈ రెండు రోజులు మినహా మిగతా రోజుల్లో ప్రతి యాత్రికుడు 20 డాలర్ల చొప్పున రుసుము చెల్లించవలసి ఉంటుందని ఆయన వివరించారు. ‘్భరత్ నుంచి కర్తార్‌పూర్ యాత్రకు వచ్చే సిక్కులు పాటించవలసిన రెండు నిబంధనలను నేను రద్దు చేశాను. ఒకటి వారు పాస్‌పోర్ట్ కలిగి ఉండవలసిన అవసరం లేదు. కేవలం చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది. రెండోది వారు పది రోజుల ముందు తమ పేర్లు నమోదు చేసుకోవలసిన అవసరం లేదు. అలాగే, కారిడార్ ప్రారంభోత్సవం రోజు, గురూజీ 550వ జయంతి రోజు ఎలాంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదు’ అని ఇమ్రాన్ ఖాన్ తన ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు.
కర్తార్‌పూర్ కారిడార్ భారత్‌లోని పంజాబ్‌లో గల డేరా బాబా నానక్ ఆలయాన్ని పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గల కర్తార్‌పూర్‌లోని దర్బార్ సాహిబ్‌ను అనుసంధానం చేస్తుంది. అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం నాలుగు కిలో మీటర్ల దూరంలో కర్తార్‌పూర్ ఉంది.