అంతర్జాతీయం

ఇమ్రాన్ గద్దె దిగాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, నవంబర్ 1: గత ఏడాది జరిగిన ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ చేసి అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని తక్షణమే గద్దె దించాల్సిన అవసరం ఉందంటూ పాకిస్తాన్ ప్రతిపక్ష పార్టీలు శుక్రవారం భారీ ఎత్తున ప్రదర్శనలు నిర్వహించాయి. ఇమ్రాన్ ఖాన్ బూటకపు ప్రభుత్వం ఇంకేమాత్రం అధికారంలో ఉండడానికి వీల్లేదని ఈ ఆజాదీ మార్చ్‌లో విపక్ష నేతలు స్పష్టం చేశారు. పాకిస్తాన్ మత నాయకుడు వౌలానా ఫజ్‌లూర్ రెహమాన్‌కు చెందిన జమాయిత్ ఉలేమా ఏ ఇస్లామ్ నాయకత్వంలో ఈ ర్యాలీ ఇస్లామాబాద్ చేరుకుంది. సింధు రాష్ట్రం నుంచి బయలుదేరిన ఈ ఆజాదీ మార్చ్ ఇస్లామాబాద్ చేరుకోవడంతో ఇమ్రాన్ ఖాన్ సర్కారుకు రాజకీయ సెగ మొదలైంది. పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ), అవామీ నేషనల్ పార్టీ (ఎఎన్‌పీ) ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఇమ్రాన్ ఖాన్ అధికారం నుంచి తప్పుకునే వరకు విశ్రమించేది లేదని ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) అధ్యక్షుడు షాబాద్ షరీఫ్ అన్నారు. ఇమ్రాన్ ఖాన్ రిగ్గింగ్‌తో అధికారంలోకి వచ్చినా దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆయనను భరించామని, కలిసి పనిచేయడానికి సిద్ధపడ్డ ఇమ్రాన్ దురహంకారంతో వ్యవహరించారని ఆయన అన్నారు. తమకు పట్టం కడితే ఆరు నెలల వ్యవధిలోనే దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతామని అన్నారు. 72 సంవత్సరాల పాకిస్తాన్ చరిత్రలో ఇంత ఘోరమైన ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ తలెత్తలేదని ఆయన తెలిపారు. ఇమ్రాన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేవరకు తాము నిద్ర పోయేది లేదని ఎఎన్‌పీ నాయకుడు ఇఫ్తికర్ హుస్సేన్ తెలిపారు. ఈ ఆజాదీ మార్చ్ ప్రధాన లక్ష్యం ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాలన్నదేనని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ ఓ కీలుబొమ్మ అని, ఆయనకు తాము తలవంచే ప్రసక్తే లేదని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో జర్దారీ అన్నారు.