అంతర్జాతీయం

కాశ్మీర్‌పై చర్చించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, నవంబర్ 2: ఈ నెలలో జరిగే భద్రత మండలి సమావేశంలో కాశ్మీర్ అంశాన్ని చర్చించడం లేదని మండలి అధ్యక్షుడు, యూకే శాశ్వత ప్రతినిధి కిరేణ్ పియాస్ స్పష్టం చేశారు. నవంబర్ నెలలో ఆయన అధ్యక్షతనే భద్రతా మండలి సమావేశాలు జరుగుతాయి. కాశ్మీర్ కంటే కూడా ప్రపంచవ్యాప్తంగా అత్యవసరంగా చర్చించాల్సిన పరిణామాలెన్నో ఉన్నాయని ఆమె తెలిపారు. నవంబర్‌లో బ్రిటన్ అధ్యక్షతన 15 మంది సభ్యులు గల భద్రతామండలి పనిచేస్తుంది కాబట్టి, ఈ సందర్భంగా కాశ్మీర్ అంశం గురించి చర్చలు జరిపే అవకాశం ఉందా? అని సిరియాకు చెందిన ఓ పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు ‘ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కీలక అంశాలు ఉన్నాయి. భద్రతామండలికి నెలకో దేశం అధ్యక్షత వహిస్తుంది కాబట్టి కొత్త అంశాలపైనే చర్చిస్తారు. భద్రతామండలి ఇదే ప్రాతిపదికన పనిచేస్తుంది’ అని ఆమె జవాబిచ్చారు. ఇటీవలే కాశ్మీర్‌పై చర్చ జరిగింది కాబట్టి, ఈనెలలో ఆ అంశాన్ని చేపట్టడం లేదని వివరించారు. పైగా, భద్రతా మండలి సభ్యులెవరు కూడా కాశ్మీర్‌పై చర్చించాలని ప్రతిపాదించలేదని అన్నారు. పాకిస్తాన్, చైనా అడ్డుపడడంతో ఆగస్టు నెలలో కాశ్మీర్ అంశంపై భద్రతా మండలి చర్చించింది. అయితే, ఈ చర్చలు రహస్య సంప్రదింపులుగానే సాగాయి. కాశ్మీర్‌కు సంబంధించి 370 ప్రత్యేక రాజ్యాంగ అధికరణను భారత్ రద్దు చేసినప్పటి నుంచి దీనిపై అంతర్జాతీయంగా అలజడి రేకెత్తించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తూనే వస్తోంది. అయితే, కాశ్మీర్ సమస్య ద్వైపాక్షికమని, దీనిపై మూడో దేశం జోక్యానికి ఆస్కారమే లేదని ఎప్పటికప్పుడు భారత్ తన వైఖరిని స్పష్టం చేస్తూనే ఉంది.