అంతర్జాతీయం

లామ్ పనితీరు భేష్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాంఘై, నవంబర్ 5: ఇటీవలి కాలంలో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (సీఈ) క్యారీ లామ్ పట్ల చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అత్యంత విశ్వాసం వ్యక్తం చేశారు. పాక్షిక స్వయంప్రతిపత్తి కలిగిన హాంకాంగ్ నగరంలో హింసాత్మక ప్రదర్శనలు పెరిగిన కొన్ని నెలల తరువాత వీరిద్దరు భేటీ అయ్యారు. వాణిజ్య కేంద్రమయిన హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య అనుకూల ప్రదర్శనలను నియంత్రించడంలో అధికారులు విఫలమవుతున్నారని, అందువల్ల హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవి నుంచి లామ్‌ను తొలగించడానికి చైనా సిద్ధమవుతోందని ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో జిన్‌పింగ్ మాత్రం లామ్‌కు గట్టి మద్దతు ప్రకటించారు. సోమవారం అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన సందర్భంగా వీరిద్దరు విడిగా సమావేశమయ్యారు. హాంకాంగ్‌లో పరిస్థితిని చక్కదిద్దడానికి లామ్ చాలా కష్టపడ్డారని జిన్‌పింగ్ వ్యాఖ్యానించినట్టు చైనా అధికార వార్తాసంస్థ జిన్హువా పేర్కొంది. ‘కేంద్ర ప్రభుత్వం లామ్ పట్ల అత్యంత విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఆమె, ఆమె పాలనాబృందం చేసిన పనిని పూర్తిగా గుర్తించింది’ అని జిన్‌పింగ్ పేర్కొన్నట్టు జిన్హువా తెలిపింది. ‘హాంకాంగ్‌లో హింస, గందరగోళాలకు ముగింపు పలికి, ప్రశాంత వాతావరణాన్ని పునరుద్ధరించడం ప్రస్తుతం అత్యంత ముఖ్యమయిన పని’ అని జిన్‌పింగ్ అన్నట్టు ఆ వార్తాసంస్థ వివరించింది. హాంకాంగ్‌లో ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలతో చర్చలు జరపడానికి సమర్థవంతంగా కృషి చేయాలని జిన్‌పింగ్ పిలుపునిచ్చారు.