అంతర్జాతీయం

పారిస్ ఒప్పందం నుంచి వైదొలగుతున్న అమెరికా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 5: వాతావరణ మార్పును నిరోధించడానికి ఉద్దేశించిన ప్రతిష్టాత్మక పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్టు అమెరికా లాంఛనంగా ప్రకటించింది. భూతాపంతో పోరాడటానికి భారత్ సహా 188 దేశాలు ఒక్కటయి కుదుర్చుకున్న పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్టు అమెరికా ఐక్యరాజ్య సమితి (ఐరాస)కు తెలియజేసింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో 2015లో జరిగిన ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సు ‘సీఓపీ 21’లో ‘పారిస్ ఒప్పందం’ కుదరడంలో డొనాల్డ్ ట్రంప్‌కన్నా ముందు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బరాక్ ఒబామా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక పాత్రలు నిర్వహించారు. ప్రమాదకరమయిన గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించడమే ఈ ఒప్పందం లక్ష్యం. చరిత్రాత్మకమయిన పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగుతుందని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2017 జూన్ ఒకటో తేదీన ప్రకటించారు. అయితే, ఈ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగే ప్రక్రియ లాంఛనంగా నోటిఫికేషన్ జారీ చేయడంతో సోమవారం మొదలయింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, అమెరికా 2020 నవంబర్ నాలుగో తేదీన ఈ ఒప్పందం నుంచి వైదొలగుతుంది. ఒప్పందం నుంచి అమెరికా వైదొలగుతున్నట్టు తెలియజేస్తూ ఐక్యరాజ్య సమితికి తాను లాంఛనంగా ఒక నోటీసు సమర్పించినట్టు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పోంపియో తెలిపారు. ‘అమెరికా ఈరోజు పారిస్ ఒప్పందం నుంచి వైదొలిగే ప్రక్రియను ప్రారంభించింది. ఒప్పందం ప్రకారం, అమెరికా తాను ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్టు తెలియజేస్తూ ఐరాసకు లాంఛనంగా ఒక నోటీసు సమర్పించింది. నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి ఏడాదికి వైదొలగడం అమలులోకి వస్తుంది’ అని పోంపియో ఒక ప్రకటనలో తెలిపారు.