అంతర్జాతీయం

ఒప్పందం కోసం అమెరికాకు రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 5: అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం మరోసారి తెరమీదికి వచ్చింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై అంగీకారం కుదిరితే, ఒప్పందంపై సంతకం చేయడానికి అమెరికాకు రావలసిందిగా ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను ఆహ్వానించారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రియెన్ ఈ విషయం తెలిపారు. ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలయిన అమెరికా, చైనా మధ్య గత సంవత్సరం నవంబర్‌లో వాణిజ్య చర్చలు మొదలయినప్పటికీ ఇప్పటి వరకు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఇరు దేశాలు ఇటు వాషింగ్టన్‌లో, అటు బీజింగ్‌లో డజనుసార్లకు పైగా సమావేశమయినప్పటికీ తమ మధ్య ఉన్న వాణిజ్య వివాదాలపై ఒక అంగీకారానికి రావడంలో విఫలమయ్యాయి. చైనా ఉత్పత్తుల దిగుమతిపై సుంకాలను భారీగా పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకోవడం, దానికి ప్రతీకారంగా అమెరికా ఉత్పత్తుల దిగుమతులపై చైనా కూడా సుంకాలను భారీగా పెంచడం వంటి పరిణామాలు చోటు చేసుకున్న తరువాత ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య వివాదాలు తీవ్రమయ్యాయి. ఆగ్నేయాసియా దేశాల సంస్థ (ఆసియాన్) సమావేశంలో పాల్గొనేందుకు బ్యాంకాక్‌లో ఉన్న అమెరికా ప్రతినిధి బృందంలోని అత్యంత సీనియర్ సభ్యులలో ఒకరయిన రాబర్ట్ ఓబ్రియెన్ అమెరికా చైనాతో గొప్ప సంబంధాలను కోరుకుంటోందని చెప్పారు. ‘మేము వాణిజ్య ఒప్పందంపై ఒక అంగీకారానికి రాగలిగితే, తొలి దశ ఒప్పందంపై సంతకం చేయడానికి అమెరికాకు రావలసిందిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను ఆహ్వానించారు. అది జరుగుతుందా? లేదా? అనేది మనం చూడవలసి ఉంది. నేను దానిగురించి ఆశాభావంతో ఉన్నాను. వాస్తవం చెప్పాలంటే నేను దానిగురించి జాగరూకతతో కూడిన ఆశాభావంతో ఉన్నాను’ అని రాబర్ట్ ఓబ్రియెన్ అన్నారు. అమెరికా, చైనా మధ్య సత్సంబంధాలు ఈ రెండు దేశాలకే కాకుండా మొత్తం ప్రపంచానికి, ఈ ప్రాంతానికి కూడా మంచిదని ఆయన పేర్కొన్నారు. అందువల్ల మేము చైనాతో సత్సంబంధాలను కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడానికి దగ్గరలో ఉన్నామని తాను భావిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ ఒప్పందం కుదురుతుందన్న విశ్వాసం కూడా తమకు ఉందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
*చిత్రాలు.. ట్రంప్ * జిన్‌పింగ్