అంతర్జాతీయం

అమెరికాలో ఛత్‌పూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 5: భారత్‌లోనే కాదు అమెరికాలోనూ ఛత్‌పూజను భక్తిప్రపత్తులతో ఘనంగా జరుపుకున్నారు. అమెరికాలో నివసిస్తున్న 500కు పైగా మంది భారత సంతతి ప్రజలు పోటోమాక్ నది ఒడ్డుకు చేరుకొని ఛత్‌పూజను నిర్వహించారు. అనేక మంది మహిళలు రంగురంగుల సంప్రదాయ చీరలు కట్టుకొని సూర్యదేవుడిని పూజించారు. భారత్‌లో తూర్పు, ఉత్తర ప్రాంతంలో, నేపాల్‌లో ప్రధానంగా ఛత్‌పూజను జరుపుకుంటారు. ఈ పూజలో భాగంగా సూర్యుడిని, ప్రాచీన వేదాలలో దేవత అయిన ఉషను కొలుస్తుంటారు. వారాంతంలో ఛత్ పండుగ రావడంతో శనివారం సాయంత్రం, ఆదివారం ఉదయం వాషింగ్టన్ శివారులోని వర్జీనియాలో గల పోటోమాక్ నదీ తీరం భారత సంతతికి చెందిన ప్రజలతో నిండిపోయింది. 500కు పైగా మంది భారత సంతతి ప్రజలు ఇందులో పాల్గొన్నారు. వీరిలో అనేక మంది కొన్ని వందల కిలో మీటర్ల దూరం నుంచి వచ్చారు. గత కొద్ది సంవత్సరాలుగా భారత సంతతి ప్రజలు నేపాల్ సంతతికి చెందిన ప్రజలతో కలిసి ఇక్కడ ఛత్‌పూజను నిర్వహించుకోవడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పాట్నా నుంచి అమెరికాకు వలస వచ్చిన కృపాశంకర్ సింగ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన భార్య అనితతో కలిసి మొదటిసారి పోటోమాక్ నది ఒడ్డున 2006వ సంవత్సరంలో ఛత్‌పూజను జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆయన ఇక్కడ ఈ పూజను నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఛత్‌పూజకోసం ఇక్కడి వస్తున్న భారత సంతతి ప్రజల సంఖ్య పెరుగుతోంది. ఈసారి చాలా మంది వచ్చారని సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. విదేశీ గడ్డపై భారతీయ సంస్కృతిని సజీవంగా ఉంచడానికి తాను చేస్తున్న ప్రయత్నమే ఈ ఛత్‌పూజ నిర్వహణ అని ఆయన పేర్కొన్నారు.