అంతర్జాతీయం

అమెరికా ఎన్నికల్లో నలుగురు భారతీయుల విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 7: అమెరికాలో జరుగుతున్న పలు రాష్ట్రాలు, స్థానిక ఎన్నికల్లో నలుగురు భారతీయ అమెరికన్లు విజయం సాధించారు. వర్జీనియా సెనేట్‌కు ఎన్నికైన తొలి ముస్లిం మహిళ కావడం ద్వారా గజాలా హష్మి చరిత్ర సృష్టించారు. అలాగే మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు వైట్‌హౌస్ టెక్నాలజీ విధాన సలహాదారుగా పనిచేసిన సుహాస్ సుబ్రహ్మణ్యం వర్జీనియా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. తొలిసారిగా ఎన్నికల్లో పోటీచేసిన గజాలా హష్మి డెమోక్రాట్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. వర్జీనియా పదో సెనేట్ జిల్లాకు జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ సెనేటర్ గ్లెన్ స్టర్ట్ ఇవాండ్‌పై ఆమె విజ యం సాధించారు. దాంతో ఆమె విజయంపై దేశవ్యాప్తంగా అం దరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇది తాను ఒంటరిగా సాధించిన విజ యం కాదని, ప్రతి ఒక్కరి సహాయ సహకారంతోనే గెలుపొందానని హష్మి తెలిపారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని వర్జీనియాలో ప్రగతిశీల మార్పులకు ప్రతి ఒక్కరు చేయూతనివ్వాలన్నారు. డెమోక్రాట్ పార్టీ తరపున విజయం సాధించి హష్మిని మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ అభినందించారు. వర్జీనియా రాష్ట్ర సెనేట్‌కు ఒక ముస్లిం మహిళ ఎన్నిక కావడం ఒక చరిత్ర అని హిల్లరీ పేర్కొన్నారు. 50 ఏళ్ల క్రితం హష్మి కుటుంబ సభ్యులు అమెరికాలో స్థిరపడ్డారు. మొదట్నుంచీ కూడా సాంస్కృతిక, సామాజిక ఆర్థిక కార్యకలాపాల్లో చురు గ్గా పాల్గొంటూనే వచ్చారు. అన్ని వర్గాల ప్రజల మధ్య ఐక్యతను, సామరస్యాన్ని పెంపొందించేందుకు కృషి చేశారు. జార్జియా సదరన్ యూనివర్శిటీ నుంచి బీఏ పట్టా పొందిన ఆమె ఇమోరి యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డీ చేశారు. 1991లో తన భర్త అజార్‌తో కలిసి రిచ్‌వౌండ్ ప్రాంతానికి నివాసాన్ని మార్చారు.