అంతర్జాతీయం

ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, నవంబర్ 7: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌పై భారత్ మరోసారి పరోక్ష దాడికి దిగింది. ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించొద్దని గురువారం అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది. ఉగ్రవాదానికి మద్దతిస్తున్న, ఉగ్రవాదులు నిధులు సమకూర్చుకోవడానికి సహకరిస్తున్న వారందరికి వ్యతిరేకంగా ప్రపంచ స్థాయిలో ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చింది. ‘ఉగ్రవాదులకు నిధులు అందనివ్వొద్దు’ అనే అంశంపై ఇక్కడ జరిగిన సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని దేశాలు ఉగ్రవాదులకు మద్దతు ఇస్తుండటం పట్ల భారత్ ఆందోళన చెందుతోందని తెలిపారు. ఉగ్రవాదానికి మద్దతిస్తున్న, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడంలో సహకరిస్తున్న వారందరికి వ్యతిరేకంగా ప్రపంచ స్థాయిలో ఐక్యంగా పోరాడవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఆయన ఈ సందర్భంగా ఏ దేశం పేరును ప్రస్తావించలేదు. ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలి ఆమోదించిన తీర్మానాలను అమలు చేయడంలో కొన్ని సభ్య దేశాలు లొసుగులను ఆధారం చేసుకొని తప్పించుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ లష్కర్ ఏ తోయిబా (ఎల్‌ఈటీ), జైషే మొహమ్మద్ (జేఈఎం), హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద గ్రూపులకు మద్దతిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఉగ్రవాద సంస్థలు భారత్‌లో వందలాది దాడులు చేశాయి. 2008లో ముంబయి నగరంపై జరిగిన 26/11 దాడి, 2001లో పార్లమెంటుపై జరిగిన దాడి ఈ కోవలోనివే. సీమాంతర ఉగ్రవాద బాధిత దేశంగా భారత్.. ఉగ్రవాదం పట్ల ఏమాత్రం ఉపేక్ష వహించరాదని సూచిస్తోందని కిషన్ రెడ్డి 65 దేశాలు పాల్గొన్న ఈ అంతర్జాతీయ సదస్సులో మాట్లాడుతూ అన్నారు. 2011లో ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చినప్పటికీ, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ అల్‌ఖైదాకు అనుబంధంగా ఉన్న అనేక ఉగ్రవాద సంస్థలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. ఈ సదస్సు ఆమోదించే తీర్మానంలో చేర్చాల్సిన నాలుగు అంశాలను ఆయన సూచించారు. శాంతి, భద్రత, అభివృద్ధికి ఏకైక అతి పెద్ద సవాలు ఉగ్రవాదమని ఆయన పేర్కొన్నారు. ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) ప్రమాణాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఐరాస లిస్టింగ్స్‌ను/ ఎఫ్‌ఏటీఎఫ్‌ను రాజకీయం చేయరాదని ఆయన పేర్కొన్నారు.