అంతర్జాతీయం

హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 8: అమెరికా ప్రభుత్వం హెచ్1బీ వీసాల జారీని మరింత కఠినతరం చేసింది. దీన్లో భాగంగా హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజును పెంచేసింది. హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజు 10 డాలర్లు పెంచినట్టు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఐటీ నిపుణులు అత్యధికంగా భారతీయులు ఎక్కువ మంది హెచ్1బీ వీసాపైనే అమెరికాకు ఉద్యోగాల కోసం వస్తుంటారు. అమెరికా కంపెనీల్లో పనిచేసేందుకు ఈ వీసాలపైనే వస్తుంటారు. వీసా ఎంపిక విధానాన్ని ఆధునీకరించేందుకు ఫీజు పెంపు దోహదపడుతుందని అమెరికా సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసుల విభాగం వెల్లడించింది. హెచ్1బీ క్యాప్ విధానం సమర్ధవంతంగా అమలు చేయడానికి ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ విధానం అమలు చేయనున్నట్టు ఫెడరల్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. హెచ్1బీ క్యాప్ విధానం మరింత మెరుగ్గా అమలు చేయడానికి ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ విధానం ఉపయుక్తంగా ఉంటుందని యూఎస్‌సీఐఎస్ తాత్కాలిక డైరెక్టర్ కెన్ కున్నీనెల్లీ స్పష్టం చేశారు. ఆధునికీకరణ అలాగే అవినీతికి తావులేకుండా ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.