అంతర్జాతీయం

టిబెట్‌లో జోక్యం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, నవంబర్ 11: నిన్నమొన్నటి వరకూ అమెరికా, చైనా మధ్య వాణిజ్య పోరు రగులుకుంటే తాజాగా టిబెట్ వ్యవహారం తీవ్ర సమస్యగా మారబోతోంది. ఐక్యరాజ్య సమితిని అడ్డం పెట్టుకుని టిబెట్ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దలైలామా వారసుడి ఎంపికలో చైనా ప్రమేయం లేకుండా చేయడానికి మరోపక్క ట్రంప్ ప్రభుత్వమూ తమ వ్యూహాలకు మరింత పదును పెట్టింది. టిబెట్ ఆథ్యాత్మిక గురువు దలైలామా వారుసుడి ఎంపిక అంశంపై ఐక్యరాజ్య సమితి దృష్టి పెట్టాలని అమెరికా రాయబారి శ్యామ్ బ్రౌన్ బ్యాక్ సూచించిన నేపథ్యంలో చైనా తీవ్రంగానే విరుచుకుపడింది. దలైలామా వారసుడి ఎంపిక టిబెట్ బౌద్ధ మతస్థులకు సంబంధించినదే తప్ప చైనా ప్రభుత్వానిది కాదని ఆ సందర్భంగా బ్రౌన్ బ్యాక్ వ్యాఖ్యానించారు. వీటిని తీవ్రంగా పరిగణించిన చైనా తమ ఆంతరంగిక వ్యవహారాల్లో ఆమెరికా జోక్యం చేసుకోవడంగానే పేర్కొంది. మత స్వేచ్ఛ పేరుతో ముసుగులో అమెరికా ఈ నాటకం ఆడుతోందని, దానిని తాము తీవ్రంగా ప్రతిఘటిస్తామని పేర్కొంది. దలైలామా వారసుడి ఎంపిక వ్యవహారంలో అమెరికా కుయుక్తులు ఏమీ పనిచేయవని, ప్రపంచ దేశాలన్నీ కూడా అగ్ర రాజ్యం చర్యను గర్హిస్తాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గెంగ్ చువాన్ పేర్కొన్నారు. దలైలామా వారసుడికి సంబంధించిన నిర్ణయం తమదేనని, ఆ వారసుడు ఎవరైనా టిబెట్‌లో చైనా పాలనను సమర్థించేవాడే అవుతాడని గెంగ్ తెలిపారు. అలాగే, 84 సంవత్సరాల ప్రస్తుత దలైలామాతోనే టిబెట్ స్వయం ప్రతిపత్తి డిమాండూ అంతరించిపోతుందని చైనా ప్రతినిధి వ్యాఖ్యానించారు. దశాబ్దాలపాటు టిబెట్ అటానమీ కోసం ప్రపంచమంతా తిరిగి ప్రచారం చేసిన దలైలామా ఇప్పుడు అలసిపోయారని చైనా పేర్కొంది.