అంతర్జాతీయం

మరింతగా చెట్టపట్టాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రెసిలియా, నవంబర్ 14: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ విస్తృత చర్చలు జరిపారు. వాణిజ్య, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై మరింత సన్నిహితంగా ముందుకు సాగాలని.. అలాగే ఇరు దేశాల సంబంధాలకు కొత్త శక్తిని, యుక్తిని అందించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. గత నెలలో చెన్నైలో జరిగిన శిఖరాగ్ర సదస్సు తర్వాత రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు కొత్త పుంతలు తొక్కాయని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. జిన్‌పింగ్‌తో ఫలవంతమైన చర్చలు జరిపానని, ద్వైపాక్షిక సహకారం సహా అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయని మోదీ ట్వీట్ చేశారు. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించిన అంశాలే ఈ చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయని విదేశీ వ్యవహాల ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. వాణిజ్యం, ఆర్థిక అంశాలకు సంబంధించి ఉన్నత స్థాయి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ఈ తాజా సమావేశంతో భారత్, చైనా మధ్య సంబంధాలు స్నేహపూర్వకమైన రీతిలో కొత్త పంథాను అందుకున్నాయని మోదీ తెలిపారు. ఈ ఐదేళ్ల కాలంలో ఈ రెండు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య విస్తరణతోపాటు పరస్పర విశ్వాసం కూడా ఎంతగానో ఇనుమడించిందన్నారు. ముఖ్యంగా చెన్నై సమావేశం తర్వాత ఇరు దేశాల నాయకత్వంలోనూ కొత్త ఉత్సాహం కనిపించిందని తెలిపారు. ఎలాంటి అజెండా లేకుండానే ద్వైపాక్షిక అంశాలతోపాటు అంతర్జాతీయ విషయాలను చెన్నైలో తాము చర్చించుకోగలిగామని మోదీ గుర్తుచేశారు. త్వరలోనే రెండు దేశాల ప్రత్యేక ప్రతినిధులు సమావేశమై సరిహద్దు అంశంతోపాటు శాంతి భద్రత తదితర అంశాలపైనా చర్చిస్తారని రవీష్ కుమార్ వెల్లడించారు. ఇటీవల షాంగైలో తాము జరిపిన దిగుమతి-ఎగుమతి ప్రదర్శనలో పాల్గొన్నందుకు జిన్‌పింగ్ కృతజ్ఞతలు తెలిపారు. గత ఏటాది కంటే కూడా ఈ ఏడాది భారత లావాదేవీల పరిమాణం గణనీయంగా పెరిగిందని జిన్‌పింగ్ అన్నారు. ఉన్నత ప్రమాణాలు జరిగిన భారత్ ఎగుమతులను ఆహ్వానిస్తామని పేర్కొన్న ఆయన.. ఉభయతారకమైన రీతిలో పెట్టుబడులూ, వాణిజ్యం మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
*చిత్రం...చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో మోదీ కరచాలనం