అంతర్జాతీయం

ఒడిశా సైకత శిల్పికి ఇటాలియన్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, నవంబర్ 16: ఒడిశాకు చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్‌కు ఇటాలియన్ బంగారు సైతక శిల్పి అవార్డు లభించింది. గత వారం ఇటలీలోని లెస్సి ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన సైతక శిల్పాల పోటీలో సుదర్శన్ పట్నాయక్ పాల్గొన్నారు. మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సైతక శిల్పి పట్నాయక్ మహాత్ముని సైతక శిల్పాన్ని రూపొందించి వీక్షకులను అబ్బుర పరిచారు. శుక్రవారం రోమ్‌లో ఏర్పాటు చేసిన అవార్డుల ఉత్సవంలో సుదర్శన్ పట్నాయక్ అవార్డును పొందారు. భారత రాయబారి ప్రతినిధిగా, మిషన్ డిప్యూటీ చీఫ్ నిహారిక సింగ్ పాల్గొన్నారు. సైతక శిల్పాల కోసం నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో ఎనిమిది మంది సైతక శిల్పులు పాల్గొన్నారు. అవార్డు పాందిన పట్నాయక్ లోగడ 60 అంతర్జాతీయ సైతక శిల్పుల ఛాంపీయన్‌షిప్ పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొనడం ద్వారా సమాజానికి దేశం పట్ల ప్రేమ, త్యాగం వంటి సందేశాలను ఇవ్వడమే తన లక్ష్యమని సుదర్శన్ పట్నాయక్ తెలిపారు. ప్రతిష్టాత్మకమైన బంగారు సైతక శిల్పి అవార్డు తనకు లభించడం పట్ల సంతోషంగా ఉందని సైతక శిల్పి పట్నాయక్ అన్నారు.
*చిత్రం... ప్రపంచ ప్రఖ్యాత సైకత చిత్రకారుడు సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన మహాత్మా గాంధీ విగ్రహమిది.
ఈ అద్భుత కళా సృష్టికే ఆయన ఇటలీ ప్రభుత్వ గోల్డెన్ శాండ్ ఆర్ట్ అవార్డును అందుకున్నారు