అంతర్జాతీయం

ముషారఫ్ దేశద్రోహం కేసుపై 28న పాక్ ప్రత్యేక కోర్టు తీర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, నవంబర్ 19: దేశ ద్రోహం కేసును ఎదుర్కొంటున్న పాకిస్తాన్ మాజీ సైన్యాధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్‌పై విచారణ జరిపిన ఆ దేశ ప్రత్యేక న్యాయ స్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 28న తీర్పును వెలువరించనున్నట్లు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ఇంకా ఏవైనా చెప్పదలచుకుంటే ఈ నెల 26వ తేదీలోగా తమకు తెలియజేయాలని ప్రత్యేక న్యాయస్థానం మాజీ నియంత జనరల్ పర్వేజ్ ముషారఫ్ తరఫు న్యాయవాదికి సూచించింది. పాకిస్తాన్ ముస్లీం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) ప్రభుత్వం కేసు నమోదు చేసింది. దీంతో 76 ఏళ్ళ ముషారఫ్ చిక్కుల్లో పడ్డాడు. అవసరం లేకుండా పాక్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)ని ముషారఫ్ విధించారన్నది ప్రధాన అభియోగం. 1999 సంవత్సరంలో నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కూలదోసి బలవంతగా అధికారాన్ని చేపట్టి 2008 సంవత్సరం వరకు కొనసాగిన సంగతి తెలిసిందే.