అంతర్జాతీయం

ఉ.కొరియాపై కొత్త ఆంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 10: తాజాగా అణు పరీక్షలు నిర్వహించినందుకు ఉత్తర కొరియాపై మరిన్ని కొత్త ఆంక్షలు విధించనున్నట్లు ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలి హెచ్చరించింది. ఉత్తర కొరియా తాజాగా అయిదోసారి అణు పరీక్షలు నిర్వహించడాన్ని మండలి తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ శాంతి, భద్రతలకు ఈ పరీక్షలు ముప్పని పేర్కొంది. ఉత్తర కొరియా గతంలో ఎన్నడూలేనంత శక్తివంతమైన అణు పరీక్షలు నిర్వహించడం వల్ల నెలకొన్న తీవ్రమైన పరిస్థితులపై చర్చించడానికి 15 సభ్యదేశాలతో కూడిన మండలి శుక్రవారం ఇక్కడ అత్యవసరంగా సమావేశమయింది. ఈ అణు పరీక్షలు భద్రతా మండలి ఆమోదించిన తీర్మానాలను, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాలను ఘోరంగా ఉల్లంఘించడమేనని మండలి పేర్కొంది. ఉత్తర కొరియా మళ్లీ అణు పరీక్షలు నిర్వహిస్తే తదుపరి గట్టి చర్యలు తీసుకుంటామని ఇదివరకు వ్యక్తం చేసిన అభిప్రాయానికి గట్టిగా కట్టుబడి ఉన్నామని మండలి సభ్య దేశాలు పేర్కొన్నాయి. ఈ నిబద్ధతకు అనుగుణంగా, మండలి తీర్మానాల ఉల్లంఘన తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఉత్తర కొరియాపై వెంటనే తగిన చర్యలు తీసుకోవడానికి కసరత్తు ప్రారంభిస్తామని మండలి సభ్య దేశాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయ చట్టాలను మళ్లీ మళ్లీ ఉల్లంఘిస్తున్న ఉత్తర కొరియాపై కొత్త ఆంక్షలు విధించాలని మండలి సభ్యదేశాలను అమెరికా, ఫ్రాన్స్ కోరాయి.

చిత్రం.. ఉత్తర కొరియా అణు పరీక్షలకు వ్యతిరేకంగా దక్షిణ కొరియాలో చేపట్టిన నిరశనలు