అంతర్జాతీయం

జమ్మూ-కాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేయడాన్ని తిరస్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, నవంబర్ 19: భారత దేశ ప్రభుత్వం జమ్మూ-కాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడాన్ని తిరస్కరించాలని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ను, భద్రతా మండలి అధ్యక్షున్ని కోరారు. ఈ మేరకు మంత్రి ఖురేషీ లేఖ మంగళవారం రాశారు. భారత ప్రభుత్వం జమ్మూ, కాశ్మీర్, లడక్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తూ ఆగస్టు 5న ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు వరకూ భారత రాజ్యాంగంలో 370-అధికరణ కల్పించిన స్వయం ప్రతిపత్తిని రద్దు చేసిందని ఆయన గుర్తు చేశారు. అక్టోబర్ 31వ తేదీ నుంచి కేంద్ర పాలిత ప్రాంతాలుగా అమల్లోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని మంత్రి ఖురేషీ మరో సమగ్ర లేఖను భద్రతా మండలి అధ్యక్షునికి కూడా పంపించారు. ఇరు దేశాల మధ్య మైత్రీ బంధాన్ని పెంచేందుకు యూఎన్ మిలటరీ అబ్జర్వర్ గ్రూపు ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్ (యూఎన్‌ఎంవోజీఐపీ) చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం కలిగించే విధంగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.