అంతర్జాతీయం

ఉగ్రవాద భూతాన్ని సమష్టిగా ఎదుర్కొందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, సెప్టెంబర్ 10: ఉగ్రవాదాన్ని తిప్పికొట్టడానికి ప్రజలంతా సమష్టిగా పోరాడాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా శనివారం ఇక్కడ పిలుపునిచ్చారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నప్పటికీ దాన్ని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్ర దాడి జరిగి 15 ఏళ్లయిన సందర్భాన్ని పురస్కరించుకుని రేడియో, ఆన్‌లైన్ ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ 9/11 దాడిపై ఇప్పుడు మాట్లాడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
‘మనలో చీలిక తేవడానికి ప్రయత్నించే శక్తులపట్ల అప్రమత్తంగా ఉందాం. సమాజంలో వైషమ్యాలు సృష్టించేందుకు జరిగే ప్రయత్నాలను పట్టించుకోవల్సిన అవసరం లేదు’ అని ఒబామా స్పష్టం చేశారు. ‘మనం ఎంతో వైవిధ్యంతో కూడిన సమాజంలో ఉన్నాం. ఏ రంగంలోనైనా ప్రతిభను ఆహ్వానిద్దాం. లింగ వివక్షకు తావులేదు. విశ్వసనీయత, నైతిక విలువలకే ప్రాధాన్యత ఇస్తున్నాం.. ఇక ముందు అలానే ఉందాం’ అని అమెరికా అధ్యక్షుడు తన రేడియో ప్రసంగంలో పేర్కొన్నారు. అమెరికన్లకు వారసత్వంగా సంక్రమించిన వాస్తవికతను, విలువలతో కూడిన విధానాలు పాటిస్తూ జాతిని పరింత పటిష్టం చేయడానికి కార్యోన్ముఖులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ విపరీతి ధోరణిపై ఒబామా నిప్పులు చెరిగారు. ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి ట్రంప్ చేస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. శాన్‌బెర్నార్డినో, కాలిఫోర్నియాలో జరిగిన కాల్పుల ఘటనను ఆసరా చేసుకుని అమెరికాలోకి ముస్లింల ప్రవేశంపై తాత్కాలిక నిషేధం విధించాలని ట్రంప్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
9/11 ఉగ్రవాద దాడి అమెరికా చరిత్రలోనే చీకటి రోజు అని ఆయన అన్నారు. ‘ఆల్‌ఖైదా దాడుల తరువాత దేశ సమగ్రత, భద్రతకు సంబంధించి అనేక చర్యలు తీసుకున్నాం. దాడులు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉన్నాం. మన ప్రాణాలు కాపాడుకున్నాం’ అని రేడియో ప్రసంగంలో ఒబామా తెలిపారు. అయినప్పటికీ బోస్టన్, శాన్ బెర్నార్డినో, ఓర్లాండోలో దురదృష్టకర సంఘటనలు చోటుచేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. పౌరులు సమష్టిగా ఉండి ఉగ్రవాదం పీచమణచాలని ఒబామా పిలుపునిచ్చారు.