అంతర్జాతీయం

గ్రీన్‌కార్డు కోసం 2.27 లక్షల మంది ఎదురుచూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: అమెరికాలో కుటుంబ ఆధారిత గ్రీన్ కార్డు కోసం 2,27,00 మంది భారతీయులు ఎదురు చూస్తున్నారు. చట్టపరమైన శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డు కచ్చితంగా ఉండాలి. తాజా లెక్కల ప్రకారం అన్ని దేశాల నుంచి గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్న వారి సంఖ్య ఏకంగా 40 లక్షల మందిపైమాటే. వారందూ ఇంతకు ముందే అమెరికాలో స్థిరపడిపోయిన ఎన్నారైల కుటుంబాలే కావడం గమనార్హం. అమెరికా ప్రభుత్వం ఏడాదికి 2,26,000 మందికి మాత్రమే కుటుంబ ఆధారిత గ్రీన్ కార్డులు జారీ చేస్తుడంతో ఎదురు చూస్తున్న వారి జాబితా పెరిగిపోతోంది. అమెరికా దక్షిణాన పొరుగుదేశమైన మెక్సికోకు చెందిన లక్షన్నర మంది గ్రీన్ కార్డు కోసం వేచి చేస్తున్నారు. భారతీయులు 2,27,000, చైనా 1,80,000 మంది కుటుంబ ఆధారిత గ్రీన్ కార్డు కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్నారు.
వీరందరూ ఎన్నారై కుటుంబాలు కావడం గమనార్హం. అమెరికా ప్రస్తుత చట్టాల ప్రకారం అమెరికా పౌరసత్వం ఉన్న వారి రక్త సంబంధీకులకే కుటుంబ ఆధారిత గ్రీన్ కార్డులు జారీ చేయడానికి అవకాశం ఉంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విధానానికి పూర్తి వ్యతిరేకి. దీన్ని రద్దుచేసి ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని కఠినతరం చేయాలన్నది ఆయన ఉద్దేశం. ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ ట్రంప్ నిర్ణయాన్ని వ్యితిరేకిస్తోంది. కుటుంబ ఆధారిత శాశ్వత నివాస విధానం రద్దు చేయడం సరైందికాదని వాదిస్తోంది. ట్రంప్ ప్రభుత్వం వల్లే చట్టపరమైన శాశ్వత గ్రీన్ కార్డు కోసం 40 లక్షల మంది ఎదురు చూడాల్సి వస్తోందని డెమోక్రాట్లు మండిపడుతున్నారు. అమెరికా పౌరసత్వం ఉన్న వారి కుటుంబాలు దశాబ్దాలుగా గ్రీన్‌కార్డు కోసం వేచిచూస్తున్నారు. ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణుల కుటుంబాలు ఎన్నో వెయిటింగ్ జాబితాలో ఉన్నాయి. అమెరికాలో స్థిరపడిన వారి పిల్లలను పెళ్లి చేసుకున్న వారు 42, 000 మంది, 2, 500 మంది దంపతులు, మైనర్లు వేలాది మంది చట్టపరమైన శాశ్వత నివాస కార్డు కోసం ఎదురు చూస్తున్నారు.