అంతర్జాతీయం

హిల్లరీ ఆరోగ్యంపై అనుమానాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 12: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ముందంజలో ఉన్న డెమొక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు కొత్తచిక్కు వచ్చిపడింది. 9/11 ఘటనకు పదిహేనేళ్లు అయిన నేపథ్యంలో న్యూయార్క్‌లోని గ్రౌండ్‌జీరో దగ్గరకు వచ్చిన హిల్లరీ అకస్మాత్తుగా పడిపోవటం, అక్కడినుంచి వెళ్లిపోవటంతో ఆమె ఆరోగ్యంపై రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రచారానికి ఒక్కసారిగా బలం చేకూరినట్లయింది. 68ఏళ్ల హిల్లరీ న్యుమోనియా, డీహెడ్రేషన్‌తో బాధపడుతున్నారని హిల్లరీ శిబిరం వెల్లడించారు. ఆదివారం గ్రౌండ్ జీరోకు వచ్చిన హిల్లరీ కుప్పకూలటంతో ఆమెను సీక్రెట్ ఏజెంట్లు వ్యాన్‌లో తరలించారు. ఎన్నికల ప్రచారంకోసం సోమవారం నుంచి సాగాల్సిన కాలిఫోర్నియా పర్యటనను కూడా ఆమె రద్దు చేసుకున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయిందని, ఆమె ఆరోగ్యానికి సంబంధించి అనుమానపు నీడలు కమ్ముకున్నాయని వాషింగ్టన్‌పోస్ట్ పేర్కొంది. హిల్లరీ ఆరోగ్యంపై ఆమె ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే వ్యతిరేక ప్రచారం చేస్తూ వస్తున్నారు. దేశాధ్యక్ష పదవిని నిర్వహించే ఆరోగ్యం, శక్తి, సామర్థ్యాలు ఆమెకు లేవని, హిల్లరీ చాలా బలహీనురాలని ట్రంప్ ప్రచారం చేశారు. తాజాగా గ్రౌండ్‌జీరో ఘటనతో ఆయన చేస్తున్న ప్రచారానికి పూర్తి బలం చేకూరినట్లయింది. ట్రంప్ మద్దతుదారులతా జాత్యహంకారవాదులని, సెక్సిస్టులనీ, హోమోలని హిల్లరీ శిబిరం ఆరోపించింది. ట్రంప్ అభ్యర్థిత్వంపై ఇంతకాలం విభేదాలతో ఉన్న రిపబ్లికన్ పార్టీ అకస్మాత్తుగా ఏకం కావటం విడ్డూరమని వ్యాఖ్యానించింది.

చిత్రం.. ఆదివారం న్యూయార్క్‌లోని తన కుమార్తె ఇంటి నుంచి వెలుపలికి వస్తున్న హిల్లరీ