అంతర్జాతీయం

‘నామ్’కు గండికొట్టిన పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్లమార్, సెప్టెంబర్ 18: అలీన దేశాల కూటమిలో ఉగ్రవాద నిరోధక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పాకిస్తాన్‌పై భారత్ ధ్వజమెత్తింది. ఉగ్రవాదుల నిరోధానికి సంబంధించి అలీన దేశాలతో ఓ వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను అడ్డగించిన ఒకే ఒక దేశం పాకిస్తాన్ అని భారత్ తెలిపింది. అలీన దేశాల కూటమి 17వ శిఖరాగ్ర సదస్సు ఉగ్రవాదాన్ని తీవ్ర పదజాలంతో ఖండించడమే కాకుండా ఈ జాడ్యాన్ని ఉమ్మడిగా ఎదుర్కొంటామని స్పష్టం చేసింది. ఇదే అంశంతో 17వ నామ్ ముసాయిదా రూపకల్పన జరుగుతోంది. ఉగ్రవాదాన్ని అణచివేయడంతోపాటు ఆయుధాల అక్రమ రవాణా నిరోధించడం తీవ్రవాద సంస్థలకు ఏ విధంగానూ నిధులు అందకుండా చేయడం వంటి అంశాలపై అలీన దేశాలు సమన్వయంతో నిర్ణయాత్మక రీతిలో వ్యవహరించాలని ఈ ముసాయిదా స్పష్టం చేసింది. అంతర్జాతీయ శాంతిభద్రతలకు అత్యంత తీవ్రస్థాయిలో ముప్పు వాటిల్లుతున్నదని ఉగ్రవాదం కారణంగానేనని నామ్ తెలిపింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, ఉగ్రవాదుల ఉద్దేశాలు ఏవైనా వారి చర్యలను గర్హించాల్సిందేనని, వాటిని నిరోధించేందుకు ఉమ్మడిగా ప్రయత్నించాల్సిందేనని ఈ 120 దేశాల కూటమి ఉద్ఘాటించింది. అలాగే సాంస్కృతిక వారసత్వ కట్టడాలను, మత ప్రదేశాలను ధ్వంసం చేయడాన్ని కూడా వెనిజులాలో జరిగిన ఈ సదస్సు తీవ్రంగా గర్హించింది. తమ మత, విశ్వాసాల ప్రాతిపదికగా మానవత్వ విఘాతక చర్యలకు ఎవరు పాల్పడినా అవి గర్హనీయమైన కృత్యాలే అవుతాయని నామ్ తెలిపింది. అలీన దేశాల కూటమి అన్ని అంశాలపై ఏకాభిప్రాయం ప్రాతిపదికగా వ్యవహరిస్తోందని ఈ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇందులో భారత్ ప్రతిపాదించిన అనేక అంశాలను కూడా పొందుపరిచారు. అలీన దేశాల కూటమిలో ఉగ్రవాదంపై వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేయాలని తాము ప్రతిపాదించామని, ఐరాసతో భారత శాశ్వత రాయభారి సయ్యద్ అక్బరుద్దీన్ ఇక్కడ మీడియాకు వెల్లడించారు. ఈ ప్రతిపాదనకు అన్ని దేశాలు మద్దతు ఇచ్చినా భారత్‌కు పొరుగున ఉన్న ఒకే ఒక దేశం (పాక్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ) వ్యతిరేకించిందని ఆయన తెలిపారు. ఈ దేశ వైఖరి కారణంగానే ఈ ప్రతిపాదనపై ఏకాభిప్రాయం సాధ్యం కాలేదన్నారు.

చిత్రం.. అలీన దేశాల కూటమి శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ, కేంద్ర మంత్రి ఎంజె అక్బర్