అంతర్జాతీయం

ఇరాక్‌లో యూఎస్ ఎంబసీపై నిరసనకారుల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగ్దాద్, డిసెంబర్ 31: ఇరాక్‌లో అమెరికా రాయబార కార్యాలయంపై నిరసనకారులు దాడికి దిగారు. కార్యాలయ ప్రహరీని పాక్షికంగా ధ్వంసం చేశారు. ఇటీవల అమెరికా జరిపిన విమాన దాడుల్లో ఇరాన్ అనుకూల వాదులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై తీవ్రంగా స్పందంచిన ఇరాన్ అనుకూల, షియా ముస్లిం వర్గానికి చెందిన ఆందోళనకారులు వేల సంఖ్యలో యూఎస్ అంబెసీపైకి దూసుకెళ్లారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు. సుమారు పది సంవత్సరాలుగా నిరసనలు కొనసాగుతున్నప్పటికీ, ఈ విధంగా యూఎస్ అంబసీపై దాడి చేయడం ఇదే మొదటిసారి. బాగ్దాద్‌లోని గ్రీన్ జోన్‌లో, అత్యంత పటిష్టమైన రక్షణ వలయం మధ్య ఉన్న ఈ రాయబార కార్యాలయం సమీపంలోకి కూడా ఎవరూ వెళ్లే అవకాశం ఉండదు. కానీ, ఈ సంఘటనలో మాత్రం, అక్కడ కాపలా ఉన్న ఇరాక్ సైనికులు, ఇతర భద్రతా దళాలు దాదాపుగా ప్రేక్షక పాత్రను పోషించాయి. ఎవరూ చెప్పుకోదగిన స్థాయిలో అడ్డుకోకపోవడంతో, నిరసనకారులు అంబసీలోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. ప్రహరీని పాక్షికంగా కూల్చివేశారు. సీసీ కెమెరాలను పగలగొట్టారు. భారీ విధ్వంసం సృష్టించారు. అంబసీకి రక్షణగా యూఎస్ మెరైన్ దళాలు పరిస్థితి తీవ్రతను గమనించి, అప్రమత్తమయ్యారు. వెనక్కు వెళ్లిపోవాల్సిందిగా పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో, వారిపై బాష్పవాయిను ప్రయోగించారు. ఫ్లాష్ బాంగ్స్‌లో వారిని అక్కడి నుంచి తరిమివేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఇరాక్ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేసినట్టు తెలిపారు.
'చిత్రం... ఇరాక్ రాజధాని బాగ్దాల్‌లోని అమెరికా ఎంబసీలోకి చొరబడి విధ్వంసం సృష్టించిన షియా ఆందోళనకారులు. ఈ సందర్భంగా అమెరికా జెండాలను తగులబెట్టారు