అంతర్జాతీయం

అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెహ్రాన్, జనవరి 8: సీనియర్ కమాండర్ ఖాసీం సులేమానీ అమెరికా జరిపిన డ్రోన్ల దాడిలో మృతి చెందడంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. సులేమానీ అంత్యక్రియలకు లక్షలాది మంది ప్రజలు హాజరు కావడం, ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కనీసం 35 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, అంత్యక్రియలు జరిగిన 24 గంటలు గడవకముందే అమెరికా స్థావరాలపై ఇరాన్ దళాలు విరుచుపడ్డాయి. 22 క్షిపణులను ప్రయోగించాయి. ఇరాక్ భూభాగంలో బేస్‌లను ఏర్పాటు చేసుకుని యుద్ధ సన్నాహాలు ప్రారంభించింది. అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాల స్థావరాలపై దాడులు జరుపుతామని ఇరాన్ వౌఖికంగా తమకు సమాచారం అందించిందని ఇరాక్ ప్రకటించింది. ఇరాన్‌లోని చమురు నిక్షేపాల కోసం అమెరికా దాడులకు దిగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలావుంటే, సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా ఆధిపత్యాన్ని సహించేది లేదని స్పష్టం చేసింది. దాడులకు ప్రతిదాడులే సమాధానమని వ్యాఖ్యానించింది. కాగా, టెహ్రాన్ నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ఉక్రేన్‌కు చెందిన ఓ విమానం కుప్పకూలడం పలు అనుమానాలకు
తావిస్తున్నాయి. ఆ విమానంలో 176 మంది ఉన్నారని, వారి జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఇరాన్ వైమానిక దళ అధికారులు ప్రకటించారు.
మరోవైపు ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో ఎవరైనా మృతి చెందారా? లేదా గాయపడ్డారా? అనే సమాచారం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఇరాక్‌లోని పశ్చిమ ప్రాంతాల్లో ఉన్న అయిన్ అల్-అసద్ ఎయిర్‌బేస్ నుంచి ఇరాన్ జరిపిన దాడుల్లో అమెరికా సైనిక స్థావరాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయని సమాచారం. అయితే, ఇరాన్ అధికారులు మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.