అంతర్జాతీయం

కొనసాగుతున్న ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెర్లిన్, జనవరి 18: జర్మనీలో రైతుల ఆందోళన కొనసాగుతునే ఉంది. వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు అంశాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ జర్మనీ రైతులు గత నెల రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా జర్మనీ సర్కారు వ్యవహరిస్తున్నదని రైతులు ఆరోపిస్తున్నారు. జాతీయోత్పత్తిలో అతి పెద్ద వాటాను కలిగివున్న వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడమేగాక, దారుణంగా దెబ్బతీసే కుట్ర జరుగుతున్నదని రైతుల ఆరోపణ. ఈ నేపథ్యంలో, గ్రీన్ వీక్ పేరుతో బెర్లిన్‌లో జరగనున్న అంతర్జాతీయ సదస్సును నిరసిస్తూ, శనివారం ట్రాక్టర్లతో రైతులు భారీ ప్రదర్శనకు దిగారు. కొన్ని ప్రాంతాల్లో వారు ట్రాక్టర్లను రోడ్లపై అడ్డంగా నిలపడంతో, భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే దిశగా చర్యలు, నిర్ణయాలు, ప్రణాళికలను చేపట్టనంత కాలం ఆందోళనను విరమించేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. వ్యవసాయాధారిత ఉత్పత్తులు, పరిశ్రమల కారణంగానే దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని, దీనిని విచ్ఛిన్నం చేస్తే, ఆర్థిక సంక్షోభం తప్పదని వారు సర్కారును హెచ్చరిస్తున్నారు.