అంతర్జాతీయం

కాశ్మీర్‌లో దురాగతాలకు స్వస్తి చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 20: కాశ్మీర్‌లో దురాగతాలకు తక్షణం స్వస్తి చెప్పి కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలు, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఇస్లామిక్ దేశాల సహకార మండలి (ఓఐసి) భారత్‌ను కోరింది. కాశ్మీర్‌లో పరిస్థితి పట్ల ఓఐసి సెక్రటరీ జనరల్ ఇయాద్ అమీన్ మదాని సోమవారం ఆందోళన వ్యక్తం చేస్తూ, అక్కడ భారత్ చేస్తున్న దురాగతాలను తక్షణం నిలిపివేయాలన్నారు. అంతేకాకుండా వివాదాన్ని కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు, భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా పరిష్కరించుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. కాశ్మీర్ ప్రజలకు తమ సంఘీభావాన్ని ఓఐసి ప్రకటిస్తూ, అంతర్జాతీయ వేదికలపై తమ సంస్థ కాశ్మీర్ ప్రజల వాణిగా ఎప్పుడూ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్‌పై ఓఐసి కాంటాక్ట్ గ్రూపు సమావేశంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్ మాట్లాడిన తర్వాత మదానీ ఈ వ్యాఖ్యలు చేశారు. అజీజ్ తన ప్రసంగంలో ‘యువ నాయకుడు’ బుర్హాన్ వనీ హత్యను, వనీ మృతి తర్వాత కాశ్మీర్ ఆందోళనకారులపై పెల్లెట్ గన్స్‌ను ప్రయోగించడాన్ని ప్రస్తావించారు. దక్షిణాసియాలో శాశ్వత శాంతికి కాశ్మీర్ సమస్య ఇప్పటికీ కేంద్ర బిందువుగా ఉందనే విషయాన్ని నొక్కి చెబుతూ, జమ్మూ, కాశ్మీర్ వివాదాన్ని అర్థవంతమైన చర్చలద్వారా పరిష్కరించుకోవడానికి పాకిస్తాన్ చేసిన ప్రతిపాదనపై భారత్ సానుకూలంగా స్పందించకపోవడంపై సలహాదారు విచారం వ్యక్తం చేశారని ఓఐసి కాంటాక్ట్ గ్రూపు విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.