అంతర్జాతీయం

ఆకాశాన్నంటే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దావోస్, జనవరి 21: ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా లేనంత విస్తృత స్థాయిలో అమెరికా ఆర్థిక వృద్ధిని సాధించిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా కలలు సాకారం అవుతున్నాయని, మరింత మెరుగైన స్థితిలో ఇప్పుడు ఉందని తెలిపారు. ప్రపంచ వార్షిక శిఖరాగ్ర సదస్సులో ప్రత్యేక ప్రసంగం చేసిన ట్రంప్ అమెరికాలో మధ్యతరగతి ప్రజలు ఉన్నంత ఆనందంగా ఎవరూ లేరని అన్నారు. గతంలో తాను చెప్పినట్టుగా అమెరికాకు పూర్వ ఔన్నత్యం మళ్లీ సిద్ధిస్తోందని తెలిపారు. తాను దేశాధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు 11 మిలియన్ల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని, అలాగే నిరుద్యోగ స్థాయి కూడా దేశ చరిత్రలో ఏ అధ్యక్షుడి హయాంలో లేనంత తక్కువ స్థాయికి చేరుకుందని తెలిపారు. చైనాతో కుదుర్చుకోబోతున్న కొత్త వాణిజ్య ఒప్పందం కూడా అత్యంత కీలకమైనదని అన్నారు.
'చిత్రం... దావోస్‌లో మంగళవారం ప్రారంభమైన ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో ప్రారంభోపన్యాసం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్