అంతర్జాతీయం

ప్రజా తీర్పును కాలరాసే ప్రయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 26: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు 2016లో ప్రజలు ఇచ్చిన తీర్పును కాలరాసేందుకు డెమోక్రాటిక్ పార్టీ ప్రయత్నిస్తున్నదని ఆయన తరఫు లాయర్లు ఆరోపించారు. ఉక్రెయిన్‌తో లావాదేవీలు తదితర అక్రమాల ఆరోపణలపై ట్రంప్ అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కాగా, ఇదంతా రాజకీయ కుట్రగా ఆయన తరఫు లాయర్లు వ్యాఖ్యానించారు. ఆరోపణలపై జరిగిన విచారణలను వారు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలుగా అభివర్ణించారు. అమెరికా చరిత్రలోనే ఈ విధంగా ప్రజా తీర్పును సవాలు చేసే విధంగా ప్రయత్నాలు జరగడం ఇదే మొదటిసారని వ్యాఖ్యానించారు. ‘డెమోక్రాట్ల ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సఫలం కానీయం’ అని వైట్ హౌస్ కౌనె్సల్ పాట్ సిపొలోన్ స్పష్టం చేశారు. చట్టసభలో కూడా ట్రంప్ లీగల్ బృందం వాదనలను వినిపించింది.