అంతర్జాతీయం

భారత్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జనవరి 26: భారత్‌తో సంబంధాలలో ఉద్రిక్తతల కొనసాగింపు సహా పాకిస్తాన్ విదేశీ వ్యవహారాలు 2020 సంవత్సరం అంతా సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంటాయి. దీని ప్రభావం దేశ ఆర్థిక, భద్రతా అంశాలపై తీవ్రంగా ఉంటుంది. ఇస్లామాబాద్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ (ఐపీఐ) ఈ మేరకు ‘పాకిస్తాన్ ఔట్‌లుక్ 2020: పాలిటిక్స్, ఎకానమి అండ్ సెక్యూరిటి’ అనే శీర్షికతో రూపొందించిన తన నివేదికలో ఈ విషయం తెలిపింది. భారత్‌తో ఉద్రిక్తతల కారణంగా వాటిని ఎదుర్కోవడం కోసం పాకిస్తాన్ తన వ్యూహాత్మక, దౌత్యపరమయిన సామర్థ్యంలో అధిక భాగాన్ని వినియోగించవలసి వస్తుందని కూడ ఐపీఐ పేర్కొందని డాన్ న్యూస్ తెలిపింది. ‘పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల వాతావరణం 2020 సంవత్సరం అంతా సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంటుంది. పాకిస్తాన్ ఆర్థిక, భద్రతా పరిస్థితులు, అంతర్గత స్థిరత్వంపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది’ అని ఐపీఐ నివేదిక అంచనా వేసింది. కాశ్మీర్‌లో పరిస్థితి, భారత్‌లో ముస్లింల పరిస్థితి ఆ దేశంతో పాకిస్తాన్ వ్యవహరించే తీరును నిర్దేశించనున్నాయి. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా ఆ నివేదిక అంచనా వేసింది. జమ్మూకాశ్మీర్‌కు ఉన్న స్వయంప్రతిపత్తిని తొలగించడానికి రాజ్యాంగంలోని అధికరణం 370ని రద్దు చేసిన తరువాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. విదేశీ వ్యవహారాల వాతావరణం, ఆర్థికస్థితి, రాజకీయ స్థిరత్వం, భద్రతా అంశాలలో ప్రస్తుత ధోరణులను విశే్లషించిన తరువాత ఐపీసీ తన నివేదికను సమీక్షించింది. దాని ఆధారంగా ఈ రంగాలలో స్వల్పకాలిక సమయంలో నెలకొననున్న పరిస్థితులను అంచనా వేసింది.