అంతర్జాతీయం

విమానంలో కలకలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనీలా, సెప్టెంబర్ 20: సౌదీ అరేబియన్ ఎయిర్‌లైన్స్ విమానం పైలట్ ఒకరు పొరపాటున ఎమర్జన్సీ అలారం బటన్ నొక్కడంతో కలకలం రేగింది. అలారం మోగడంతో ఒక్కసారిగా ప్రయాణిలు భీతిల్లిపోయారు. అంతేకాదు.. విమానాశ్రయంలోని భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. హైజాక్ జరిగిపోయి ఉంటుందన్న ఆందోళన అందరిలోనూ వ్యక్తమైంది.
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా విమానాశ్రయంలో మంగళవారం మధ్యాహ్ననం చోటుచేసుకుంది. విమానం నుంచి కంట్రోల్ టవర్‌కు సంకేతాలు రావడంతో జడ్డా నుంచి వస్తున్న విమానం అత్యవసరంగా దించేశారు. మనీలాలో సౌదీ విమానం ల్యాండ్ అవ్వగానే భద్రతా సిబ్బంది చుట్టుముట్టేశారు. ప్రయాణికులను రెండు గంటలపాటు విమానంలోనే ఉంచేశారు. తరువాత అంటే సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బయటకు వచ్చారు. భద్రతా సిబ్బంది తనిఖీల తరువాత పైలెట్ పొరపాటువల్లే ఇదంతా జరిగిందని తేలింది. ‘పరిస్థితి చక్కబడింది. పైలెట్ అత్యవసర లైట్ బటన్ నొక్కడంవల్లే ఈ గందరగోళం తలెత్తింది. దీని వెనక ఎలాంటి విద్రోహ చర్య లేదు’ అని మనీలా పోలీసులు చీఫ్ ఆఫీసర్ ఆస్కార్ అల్బాయల్డే వెల్లడించారు.

చిత్రం.. మనీలాలో అత్యవసరంగా దిగిన సౌదీ అరేబియన్ ఎయిర్‌లైన్స్ విమానం